For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CEO's Voice: కంప్యూటర్ సైన్స్ నేర్పించండి.. స్కూళ్లకు ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సీఈవోల విన్నపం.. ఎందుకంటే..

|

CEO's Voice: ఆధునిక యుగంలో సాఫ్ట్ వేర్ల వినియోగం అన్ని రంగాల్లోనూ కీలకంగా మారిపోయింది. ప్రస్తుతం అవసరాలకు తగినట్లుగా టెక్కీలు లేనందున ప్రపంచ వ్యాప్తంగా కొంత కొరత ఉంది. అయితే అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు భవిష్యత్తులో సంక్షోభం నివారించేందుకు నేటి తరం పిల్లలకు చిన్నవయస్సు నుంచే కంప్యూటర్ సైన్స్ బోధన చేయాలని కోరుతున్నాయి.

సిలబస్ నవీకరణ..

అమెరికాలోని 500కు పైగా అగ్రశ్రేణి పరిశ్రమలు, లాభాపేక్ష రహిత సంస్థలు, US రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా నాయకులు కంప్యూటర్ సైన్స్ బోధనను చేర్చడానికి 12వ తరగతి పాఠ్యాంశాలను నవీకరించాలని పిలుపునిచ్చాయి. ఇలా అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయికి ముందు నుంచే టెక్నికల్ సైన్స్ పై విద్యార్థులకు పట్టు దొరుకుతుందని వారు భావిస్తున్నారు.

వ్యవస్థాపకుల లేఖ..

యాపిల్ సీఈవో టిమ్ కుక్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ కంపెనీల వ్యవస్థాపకులు ఈ చొరవకు మద్దతు ఇస్తూ ద్వైపాక్షిక లేఖను విడుదల చేశారు. "ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి" "కంప్యూటర్ సైన్స్ నేర్చుకునే అవకాశం" ఉండేలా చూడాలనే వారి కోరికను లేఖలో తెలిపారు.

ఉపాధి కల్పిస్తామంటున్న సీఈవోలు..

ఉపాధి కల్పిస్తామంటున్న సీఈవోలు..

సీఈవోలు "USAలోని ప్రతి నగరంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు తయారీ నుంచి బ్యాంకింగ్ వరకు, వ్యవసాయం నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ప్రతి రంగంలో సమిష్టిగా ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం.. కంప్యూటర్ సైన్స్ విద్యలో ఇంటర్న్‌షిప్‌లను అందించడం ద్వారా వెనుకబడిన కమ్యూనిటీలకు మద్దతిస్తామని పేర్కొన్నారు. వారికి ఆర్థికంగా సహాయం అందించి తమ వంతు సహాయం అందిస్తామని చెబుతున్నారు.

ఉచితంగా నైపుణ్యాలు..

ఉచితంగా నైపుణ్యాలు..

కొంతమంది తమ అనుభవాలను ఈ విషయంతో పంచుకోవడానికి ట్విట్టర్‌లోకి కూడా వెళ్లారు. కుక్ ఒక వ్యక్తి నేర్చుకోగల అత్యంత విలువైన నైపుణ్యాలలో ఒకటి కోడింగ్ అని తెలిపారు. గేట్స్ తన 13వ ఏట కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవటం వల్ల, అది తన జీవిత గమనాన్ని ఎలా మార్చిందో వివరించారు. దీనిని ఔత్సాహికులకు చేరువ చేసేందుకు సీటెల్ ఆధారిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాభాపేక్షలేని Code.orgతో ఇండస్ట్రీ దిగ్గజ నాయకులు జట్టుకట్టారు

Read more about: apple amazon microsoft
English summary

CEO's Voice: కంప్యూటర్ సైన్స్ నేర్పించండి.. స్కూళ్లకు ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సీఈవోల విన్నపం.. ఎందుకంటే.. | us tech companies ceo's requesting schools to make computer scine as subject from school grade know complete details

The CEOs of Apple, Amazon, Microsoft, and Meta are begging schools to teach computer science
Story first published: Thursday, July 14, 2022, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X