ఒక్కసారిగా రూ.25,000 కోట్ల నష్టం… ఆంధ్ర రొయ్యల రంగం భవిష్యత్తుని చంద్రబాబు కాపాడగలరా?

ఆంధ్ర ప్రదేశ్ లోని రొయ్యల రంగం ఇప్పుడు పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. ఎన్నేళ్లుగా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన ఈ రంగం ఇప్పుడు అమెరికా టారిఫ్‌ల ఈ రంగాన్ని బాగా దెబ్బతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన వివరాల ప్రకారం, ఈ పన్నుల వల్ల దాదాపు రూ.25,000 కోట్ల వరకు నష్టం జరిగిపోయింది. అంతేకాదు, రొయ్యల ఎగుమతి ఆర్డర్లలో 50% వరకూ రద్దు కావాల్సి వచ్చింది.

ఈ సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ‌, వాణిజ్యశాఖ మంత్రి ‌, మత్స్యశాఖ మంత్రి‌లకు లేఖలు రాసి, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

US Tariffs Just Crushed Andhra Pradesh s Shrimp Sector Can Chandrababu Naidu Save It

దేశం మొత్తం రొయ్యల ఎగుమతుల్లో ఎనభై శాతం వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోంది. అలాగే సముద్ర ఆహార ఎగుమతుల్లో 34% కూడా ఈ రాష్ట్రం నుంచే వస్తోంది. ఈ ఎగుమతుల వార్షిక విలువ దాదాపు రూ.21,246 కోట్లు. ఈ రంగం పై నేరుగా 2.5 లక్షల కుటుంబాలు, పరోక్షంగా మరో 30 లక్షల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ ప్రస్తుతం అమెరికా విధించిన పన్నుల వల్ల 2,000 కంటైనర్ల రొయ్యల ఎగుమతులపై రూ.600 కోట్ల పన్నులు పడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రొయ్యల రైతులకు ఉత్సాహం కలిగించేందుకు కొన్ని సహాయక చర్యలు చేపడుతోంది. ముందుగా, ఆక్వా ఫీడ్ తయారీదారులతో చర్చలు జరుపుతూ, రైతులకు ఉపయోగపడే ఫీడ్ ధరను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా రొయ్యల పెంపకంలో ఫీడ్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కిలో ఫీడ్ ధరను దాదాపు రూ.9 వరకు తగ్గించేలా తయారీదారులను ఒప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇలా చేస్తే రైతుల ఖర్చు తగ్గి, వారి లాభం కొంచెం అయినా పెరిగే అవకాశం ఉంటుంది.

అదే విధంగా, రొయ్యల ఫార్మ్‌లకు అవసరమైన విద్యుత్ సరఫరా ఖర్చును తగ్గించడానికి, సబ్సిడీతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు అందించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రొయ్యల ఫార్మ్‌లు ఎక్కువ విద్యుత్ వినియోగం చేయాల్సి వస్తుంది కాబట్టి, ట్రాన్స్‌ఫార్మర్లు తక్కువ ధరకు లేదా సబ్సిడీతో అందితే రైతులపై ఉండే ఆర్థిక భారం కొంత తగ్గుతుంది. ఈ రెండు చర్యలు కూడా రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, వారి ఆదాయాన్ని పెంచడానికే ఉద్దేశించబడ్డాయి.

కేంద్రానికి చంద్రబాబు సూచనలు:

సీఎం నాయుడు రొయ్యల రంగాన్ని కాపాడేందుకు కేంద్రం నుంచి ఈ సూచనలు చేశారు. రొయ్యల ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. సముద్ర ఆహారం అంటే ప్రోటీన్ అధికంగా ఉండే, శరీరానికి చాలా పోషక విలువలతో కూడిన ఆహారం అని గుర్తుచేశారు. ప్రస్తుతం భారతదేశంలో వ్యక్తి ప్రాతిపదికన సంవత్సరానికి సముద్ర ఆహార వినియోగం 12-13 కిలోలకే పరిమితం అయి ఉంటే, ప్రపంచ సగటు మాత్రం 20-30 కిలోల మధ్యలో ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ రంగంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

అలాగే, రొయ్యల ఉత్పత్తులను దేశం నలుమూలలకూ సులభంగా తరలించేందుకు, దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇలా చేస్తే రవాణా సౌకర్యం మెరుగుపడి, రైతులకు మంచి మార్కెట్ దొరకే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇక మత్స్యకార కుటుంబాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒకసారి మాత్రమే రూ.1 లక్ష టాప్-అప్ లోన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, రొయ్యల రంగం పోటీ శక్తిని పెంచేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ సదుపాయాలు, కోల్డ్-చైన్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కూడా సూచించారు.

అదనంగా, రాష్ట్రంలో రొయ్యల రంగాన్ని బలోపేతం చేయడానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, రొయ్యలు మరియు ఇతర సముద్ర ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఆధునిక కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, పరిశుభ్రతతో కూడిన చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల దగ్గర నుంచే నేరుగా మార్కెట్‌కి సరఫరా అయ్యేలా సరఫరా గొలుసును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది మధ్యవర్తులను తగ్గించడంలో, రైతులకు నేరుగా మంచి ధర రావడంలో సహాయపడుతుందని అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+