ట్రంప్ టారిఫ్‌లకు భారత్ ప్రతీకారం.. యూఎస్ వస్తువులపై 25% టారిఫ్‌లు విధించాలని డిమాండ్

US Tariff Row: భారత ఎగుమతులపై అమెరికా ప్రతిపాదించిన అధిక సుంకాల చర్యలపై దేశీయ వ్యాపార, ఎగుమతి వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాషింగ్టన్ ఏకపక్ష నిర్ణయానికి ధీటుగా స్పందిస్తూ.. అమెరికా నుండి భారత్‌లోకి దిగుమతి అయ్యే వస్తువులపై కూడా ప్రతీకారంగా 25 శాతం పరస్పర సుంకాన్ని (Reciprocal Tariff) విధించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనుంది.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల చైనా, యూరోపియన్ యూనియన్ సహా 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థల పారిశ్రామిక రాయితీలు, ఎగుమతి విధానాలపై విచారణ వేగవంతం చేస్తూ అదనపు సుంకాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ప్రతిపాదించిన సుంకాల విధానం ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వ్యాపారులు, తయారీదారులలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించిందని సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ పేర్కొన్నారు.

India US trade war 25 retaliatory tariffs PM Modi Indian traders demand US tariffs on India Trump tariff proposal India US trade deal American goods import duty CTI Brijesh Goyal Indian exporters 25 CTI

భారత్ అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే 17 శాతం సుంకం విధిస్తామని, ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకం విధిస్తామని వాషింగ్టన్ సంకేతాలు జారీ చేయడంపై వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయని ఆయన వివరించారు. ఇంతకుముందు అమెరికా సుప్రీంకోర్టు కొన్ని విస్తృత సుంకాలను కొట్టివేసినప్పటికీ.. 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301, ఇతర నిబంధనల కింద ట్రంప్ యంత్రాంగం దిగుమతి పన్నులను అస్త్రంగా వాడుకోవడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది.

Also Read

భారతీయ ఎగుమతిదారులకు అమెరికా అతిపెద్ద, అత్యంత కీలకమైన విదేశీ మార్కెట్ అని గోయల్ గుర్తుచేశారు. భారత్ నుండి అమెరికాకు వస్త్రాలు (టెక్స్‌టైల్స్), ఔషధాలు (ఫార్మా), వైద్య సామాగ్రి, ఎలక్ట్రానిక్, విద్యుత్ వస్తువులు, సముద్రపు ఆహారం (సీఫుడ్), ముత్యాలు, ఆభరణాలు, లోహాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్, ఆటో విడిభాగాలు భారీ స్థాయిలో ఎగుమతి అవుతున్నాయి. సుంకాల పెంపు అమలైతే అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి పోటీతత్వం దెబ్బతింటుందని, తద్వారా ఎగుమతి ఆర్డర్లు తగ్గి చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు అమెరికా నుండి భారత్‌కు ఆహార ఉత్పత్తులు, పానీయాలు, బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు, ఖనిజాలు, రసాయనాలు తదితర వస్తువులు భారీగా దిగుమతి అవుతున్నాయి. ఆయా అమెరికన్ ఉత్పత్తులపై భారత్ సైతం 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తే దేశీయ మార్కెట్లో అవి ఖరీదైనవిగా మారి వాషింగ్టన్‌కు గట్టి ఆర్థిక సమాధానం ఇచ్చినట్లవుతుందని బ్రిజేష్ గోయల్ వాదించారు.

ఇప్పటికే రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ఒత్తిడిలో ఉండటం, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరుకు రవాణా ఖర్చులు పెరగడం ఎగుమతిదారులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య చర్చల వేళ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా దృఢమైన వైఖరిని అవలంబించాలని, దేశీయ పరిశ్రమలు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే ప్రతీకార సుంకాల దిశగా అడుగులు వేయాలని సీటీఐ తన లేఖలో ప్రధానిని కోరనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+