For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు, అమెరికా స్టాక్స్ 2% డౌన్

|

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా నాస్‌డాక్ 3 శాతం మేర నష్టపోగా, ఎస్ అండ్ పీ సూచీ 2.37 శాతం, డౌజోన్స్ 1.9 శాతం క్షీణించింది. యూరోపియన్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. యూకే ఎఫ్‌టీఎస్ఈ 1.20 శాతం, ఫ్రెంచ్ మార్కెట్ సూచీ సీఏసీ 0.62 శాతం, జర్మన్ డాక్స్ సూచీ 0.39 శాతం మేర స్వల్పంగా లాభపడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, మహమ్మారి సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి.

డౌజోన్స్ 525 పాయింట్లు(1.9%) క్షీణించి 26,763 వద్ద, ఎస్ అండ్ పీ 79 పాయింట్లు (2.3) నష్టంతో 3,237 వద్ద, నాస్‌డాక్ 331 పాయింట్లు (3%) నష్టపోయి 10,633 వద్ద స్థిరపడింది. దీంతో సెప్టెంబర్‌లో నమోదైన చరిత్రాత్మక గరిష్టాల నుంచి ఎస్ అండ్ పీ 10 శాతం, నాస్‌డాక్ 12 శాతం క్షీణించాయి. డౌజోన్స్ ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టం కంటే 9.4 శాతం దిగువన నిలిచింది. కరెక్షన్‌కు సంకేతంగా భావిస్తున్నారు.

కుప్పకూలిన మార్కెట్లు, సెన్సెక్స్ 663 పాయింట్లు డౌన్: దెబ్బకొట్టిన టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్

నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు, అమెరికా స్టాక్స్ 2% డౌన్

ఈ రోజు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. సింగపూర్ నిఫ్టీ 1.95 శాతం, జపాన్ నిక్కీ 1.11 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్ షెగ్ 1.86 శాతం, తైవాన్ వెయిటెడ్ 2.54 శాతం, కొరియా కోస్పి 2.51 శాతం, జకర్తా కాంపోసిట్ ఇండెక్స్ 1.89 శాతం మేర నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి సింగపూర్ నిఫ్టీ స్వల్ప లాభాల్లోకి వచ్చింది.

English summary

US stock futures see volatile moves following sell off on Wall Street

Stock futures fell during early morning trading on Thursday, building on Wednesday’s heavy losses that saw the S&P 500 tumble more than 2%.
Story first published: Thursday, September 24, 2020, 12:37 [IST]
Company Search