Employee Fired: ఎక్కడైనా ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలంటే కంపెనీలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంటాయి. కనీసం కొద్దిరోజులు అతని పనితీరును నిసితంగా గమనించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుంటాయి. కానీ అమెరికాలో ఒక కంపెనీ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అమెరికా కంపెనీ..
యూఎస్‌లో ఓ స్టార్టప్ కంపెనీ తన కంపెనలోని ఒక ఉద్యోగిని తొలగించిన రోజే మళ్లీ నియమించుకోవటం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 31 ఏళ్ల ఉద్యోగంపై అసంతృప్తితో ముందుగా కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. అయితే బాస్ ని కలిసిన తర్వాత పరిస్థితి మెుత్తం మారిపోయింది.

VizyPay స్టార్టప్..
కైల్ మెక్‌కాన్ అనే వ్యక్తి అమెరికన్ స్టార్టప్ కంపెనీ అయిన VizyPayలో ఉద్యోగం చేస్తున్నాడు. 2017లో కంపెనీలో సేల్స్ అకౌంట్ మేనేజర్‌గా చేరి పదోన్నతి కూడా పొందాడు. అయితే.. కైల్ మెకాన్‌ను అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారు. అతని పనితీరు సరిగా లేదంటూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తొలగించబడిన తర్వాత సదరు ఉద్యోగి VizyPay CEO ఆస్టిన్ మెక్‌నాప్‌ను కలవాలని నిర్ణయించుకున్నాడు.

బాస్ తో సమావేశం..
కైల్ మెకాన్‌కు బాస్ ను కలిసిన తర్వాత ఏమైందో తెలియదు కానీ.. మళ్లీ అదే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. స్టార్టప్‌లో తనకు ఎదురైన సానుకూల అనుభవాల గురించి, కంపెనీ వృద్ధికి తాను ఏమి చేయాలనుకుంటున్నానో బాస్‌తో మాట్లాడినట్లు అతడు వెల్లడించాడు. అలా అతనికి ఉద్యోగం తిరిగి వచ్చింది.

సీఈవో ఏమన్నారంటే..?
కైల్ మెక్‌కాన్ సంభాషణ నుంచి అతను వినయంగా ఉన్నాడని తాను అర్థం చేసుకున్నాను అంటూ VizyPay CEO ఆస్టిన్ మెక్‌నాప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు. అతను చెప్పిన కారణాలను అంగీకరించానన్నారు. సాకులు చెప్పకుండా, అతను పరిస్థితులను ఎదుర్కొన్న తీరు నన్ను పునరాలోచనలో పడేలా చేసిందని చెప్పాడు. ఉద్యోగిని యజమాని అర్థం చేసుకోవటంపై నెజిటన్లు ప్రశంశిస్తున్నారు.

అసలైన నిజాయితీ..
మెక్‌నాప్ నిజమైనవాడు, నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసేవాడని నేను భావించాన్నానని కంపెనీ సీఈవో పేర్కొన్నారు. అతనితో జరిగిన సంభాషణలో నా ప్రవృత్తి నన్ను అలా ఆలోచించేలా చేసింది. కాబట్టి అతన్ని ఎలాగైనా తిరిగి VizyPayలో పనిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications