ChatGPT: ఓపెన్ ఏఐ వేగంగా వృద్ధి చెందటం ప్రపంచ వ్యాప్తంగా పెను సవాళ్లకు దారితీస్తోంది. ఐటీ సేవల నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వరకు అనేక రంగాల్లో ఆర్టిఫీషియల్ తన హవా మెుదలు పెడుతోంది. ఈ క్రమంలో ఇటీవల IBM సైతం ఖాళీ అయిన ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తామని సంచలన ప్రకటన విడుదల చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులు సంచలనాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో మెుదటి సారిగా డిజిటల్ సేవల రంగంలోని ఒక కంపెనీ కుప్పకూలటంతో అందరూ షాక్ అవుతున్నారు. చాట్ జీపీటీ కారణంగా అమెరికా సిలికాన్ వ్యాలీ స్టార్టప్ అయిన CHEGG షేర్లు 50 శాతం వరకు పడిపోయాయి. ఈ సంస్థ పాఠశాల పాఠ్యపుస్తకాలను ప్రచురించటం, ఆన్‌లైన్ తరగతులు, పాఠశాల పిల్లలకు హోంవర్క్ లో సహాయం వంటి సేవలను అందిస్తుంది.
ChatGPT వంటి ఉత్పాదక AI చాట్‌బాట్‌ల వేగంగా అందుబాటులోకి వస్తుండటంతో CHEGG కంపెనీ రాబడితో పాటు వ్యాపారం కూడా ప్రభావితం అయినట్లు సీఈవో ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎలాంటి ప్రభావం లేనప్పటికీ.. మార్చి తర్వాత చాట్‌జీపీటీపై విద్యార్థుల ఆసక్తి , వినియోగం పెరిగిందని ఆయన వెల్లడించారు. దీంతో తమ ఆదాయం, కస్టమర్ బేస్ దెబ్బతింటున్నట్లు పేర్కొన్నారు.

ChatGPT బూమ్ కారణంగా గత సంవత్సరంలో CHEGG విక్రయాలు 7 శాతం తగ్గాయి. ఇదే సమయంలో చందాదారుల సంఖ్య ఏకంగా 5 శాతం మేర పడిపోయింది. కంపెనీ ఈ సమాచారాన్ని విడుదల చేయటంతో దాని షేర్లు వేగంగా విలువను కోల్పోవటం ప్రారంభించాయి. మే 1న 17.59 డాలర్లుగా ఉన్న కంపెనీ షేర్ విలువ కేవలం ఒక్కరోజులో 50 శాతం క్షీణించి మే 2న 8.76 డాలర్లకు దిగజారింది. దీంతో చాట్ జీపీటీ వల్ల ప్రభావితమైన కంపెనీలన్నీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
చాలా కాలంగా ప్రపంచ టెక్ రంగానికి బ్యాక్ ఆఫీసుగా పనిచేస్తోంది భారత ఐటీ రంగం. అయితే రానున్న కాలంలో చాలా ఉద్యోగాలను ఏఐ కనుమరుగయ్యేలా చేయగలదని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ ఆఫ్ AI అని పిలవబడే జెఫ్రీ హింటన్ గూగుల్ కంపెనీని వీడారు. చాలా కాలం కిందటే ఏఐ వినియోగంపై దృష్టి సారించి ఆవిష్కరణలు చేసిన ఆయన ప్రస్తుతం తప్పుచేశాననే భావనను వ్యక్తం చేశారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications