Madhabi Puri Buch: అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ పట్టువదలని విక్రమార్కుడి లాగా అదానీపై తన పోరును కొనసాగిస్తోంది. దాదాపు మెుదటి నివేదిక విడుదల చేసి 18 నెలలు గడుస్తున్నా ఈ వ్యవహారంలో సరికొత్త అంశాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి ఏకంగా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధబి పూరీ బుచ్ టార్గెట్ కావటం విశేషం.
సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌పై షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు, దానిపై బుచ్ దంపతులు సమాధానం ఇచ్చిన తర్వాత హిండెన్‌బర్గ్ మళ్లీ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. దీంతో ఆగస్టు 11 రాత్రి నుంచి తన ప్రశ్నలను ట్వీట్ల ద్వారా తెరమీదకు తీసుకొచ్చింది. సరికొత్త ట్వీట్ ప్రకారం.. బుచ్ ప్రతిస్పందన ఇప్పుడు అస్పష్టమైన బెర్ముడా/మారిషస్ ఫండ్ నిర్మాణంలో ఆమె పెట్టుబడులు బహిరంగంగా నిర్ధారిస్తోందని పేర్కొంది. ఈ క్రమంలో డబ్బు వివరాలు కూడా ధృవీకరించబడిందని హిండెన్‌బర్గ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఆ సమయంలో అదానీకి డైరెక్టర్‌గా ఉన్న తన భర్త చిన్ననాటి స్నేహితుడు ఈ ఫండ్‌ను నడుపుతున్నాడని కూడా ఆమె ధృవీకరించిందని హిండెన్ బర్గ్ వెల్లడించింది.

అలాగే అదానీ కేసులో SEBI విచారణలో భారీ 'ఆసక్తి సంఘర్షణ'ను ఉటంకిస్తూ.."అదానీ కేసుకు సంబంధించిన పెట్టుబడి నిధులను పరిశోధించడానికి సెబీ బాధ్యత వహించింది. ఇందులో బుచ్ "పెట్టుబడి వ్యక్తిగతంగా, నిధులతో చేయబడింది. మా అసలు నివేదికలో హైలైట్ చేయబడిన అదే స్పాన్సర్ అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పింది.
దీనికి తోడు సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బుచ్ అగోరా పార్ట్‌నర్స్ సింగపూర్‌లో 100% వాటాదారుగా ఉన్నారు. అయితే ఆమె SEBI హోల్ టైమ్ మెంబర్‌గా పదవీకాలం మొత్తంలో ఆమె అగోరాకు యజమానిగా ఉన్నారు. సెబీ చైర్మన్‌గా నియమితులైన 2 వారాల తర్వాత ఆమె తన షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఇప్పటికీ 99 శాతం SEBI చైర్‌పర్సన్ యాజమాన్యంలో ఉన్న భారతీయ యూనిట్, ఆమె ఆర్థిక నివేదికల ప్రకారం 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో 3 లక్షల డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ఇదే సమయంలో ఆమె సెబీకి చైర్‌పర్సన్‌గా కూడా కొనసాగటంపై హిండెన్ బర్గ్ కాన్సిపరసీ ఉందని పేర్కొంది.
భారతీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి చీఫ్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి వ్యక్తిగత ఈ-మెయిల్‌ల కాపీలను చూపించింది. హిండెన్‌బర్గ్ శనివారం ఒక నివేదికలో "సెబిలో పూర్తి-సమయం సభ్యునిగా పని చేస్తున్నప్పుడు బుచ్ తన భర్త పేరును మెయిల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించారని ఆరోపించింది. "సెబీ ఛైర్‌పర్సన్ అధికారిక పదవిలో ఉంటూ తన భర్త పేరు మీద ఏ ఇతర పెట్టుబడులు లేదా వ్యాపారాలు చేసారు?" అంటూ కొత్త ప్రశ్నలు లేవనెత్తింది.


Click it and Unblock the Notifications