చైనాకు భారీ షాకిచ్చిన ముఖేష్ అంబానీ.. భారత్ దెబ్బ రుచి చూడమంటున్న జియో అధినేత

ఇటీవల అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. అమెరికా నుంచి చైనా వెళ్లాల్సిన ఎథేన్ గ్యాస్ ట్యాంకర్, అనూహ్యంగా భారతదేశానికి మళ్లింపబడుతుంది. అదీ మన దేశంలో పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వస్తుంది.

Reliance ethane import US-India energy trade Ethane tanker diverted from China US-China trade tension Trump tariffs India petrochemical supply Strategic trade deal Ethane export restrictions - -

అసలు ఈ ఎథేన్ చమురు, చైనా లోని పెట్రోకెమికల్ పరిశ్రమల కోసం కావాల్సింది ఈ చమురు. కానీ ఇటీవల అమెరికా ప్రభుత్వం చైనా మీద ఎథేన్ ఎగుమతులకు కొన్ని నియంత్రణలు విధించడంతో, ఆ ట్యాంకర్ ఇటు ఇండియా కి మారింది. చైనా బదులు, ఇండియాలోని గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్న దహెజ్‌ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇది చేరింది. ఇది ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎథేన్ దిగుమతిదారుల్లో ఒకటిగా రిలయన్స్‌ని మరొకసారి గుర్తించేలా చేసింది.

రిలయన్స్ ఇప్పటికే అమెరికా నుంచి ఎథేన్‌ను దిగుమతి చేసుకునే ప్రత్యేక షిప్పింగ్ వ్యవస్థను స్థాపించి, దాన్ని తన మూడు పెట్రోకెమికల్ ప్లాంట్ల (దహెజ్, హజిరా, నాగోఠణే)కి సరఫరా చేస్తూ ఉంది. ఈ మార్పుతో పాటు కంపెనీకి మరింత సరళంగా, తక్కువ ఖర్చుతో ముడి పదార్థాలు అందుబాటులోకి తీసుకు వస్తాయి. అమెరికా-చైనా మధ్య అభివృద్ధి చెందిన ఈ ఉద్రిక్తత మన దేశ పరిశ్రమలకు పరోక్షంగా మేలే చేసింది.

ఎథేన్ ఒక కీలక ఫీడ్‌స్టాక్ (feedstock), ముఖ్యంగా ప్లాస్టిక్, కెమికల్స్, సింథటిక్ ఫైబర్స్ తయారీకి ఉపయోగపడుతుంది. దీని లభ్యత పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తి వ్యయాలు తగ్గి, స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయి. దీని వల్ల ఎగుమతులపై ఆధారపడే ఇండస్ట్రీలకు పోటీ సామర్థ్యం పెరుగుతుంది.

అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న $43 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించేందుకు, భారత్‌తో గ్యాస్ వ్యాపారం జరిపే దిశగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో, భారత్‌ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషిస్తోంది. జూలై 9 నాటికి అమల్లోకి రానున్న 26% పరస్పర టారిఫ్‌లకు ముందు, అమెరికా-భారత్ మధ్య గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని వేగంగా కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యూహాత్మక చలనం చోటు చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, చైనా బదులు భారతదేశంలోని దహెజ్‌లో ఉన్న రిలయన్స్ ప్లాంట్‌కి ఎథేన్ సరఫరా మారడం ద్వారా, అమెరికా తాత్కాలికంగా తన ఎగుమతుల ఆదాయాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇది ఒకవైపు అమెరికా ట్రేడ్ గ్యాప్‌ను తగ్గించడంలో తోడ్పడుతుండగా, మరోవైపు భారత్‌కు కీలకమైన ఎనర్జీ సోర్స్‌ను సమయానికి అందుబాటులోకి తెస్తోంది.

ఎథేన్ అనేది వేరే ఇంధనంతో పోల్చితే ఇది ఒక క్లీనర్ హైడ్రోకార్బన్. దేశీయంగా పెట్రోకెమికల్స్ తయారీలో దీన్ని ఉపయోగించడం వలన కాలుష్యం కొంతమేర తగ్గించే అవకాశముంది. రిలయన్స్ వంటి సంస్థలు ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ మార్గంలో అడుగులు వేస్తుండడంతో, ఇది సరైన దిశగా మరో పటిష్టమైన అడుగు అవుతుంది.

ఈ ఘటన మనకు ఒక పెద్ద విషయాన్ని గుర్తు చేస్తోంది. అంతర్జాతీయ రాజకీయాలు, వ్యాపార ఒప్పందాలు ఒక్కసారి మారితే, ప్రపంచ ఎకానమీలోని చక్రాలు ఎటు తిరుగుతాయో ఊహించలేం. కానీ అలాంటి పరిస్థితుల్లో మనదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓ విధంగా ఇది ఒక అవకాశంగా మారుతుంది. రిలయన్స్‌కి ఇది కేవలం ఓ డీలే కాదు ఇది ఇండియన్ ఎనర్జీ రంగం కోసం తెరచిన మరో గేటే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+