Adani Bribery: అదానీకి బిగుస్తున్న ఉచ్చు.. అదానీ గ్రీన్ స్టాక్ పతనం తప్పదా! బలంగా సాక్ష్యాలు..

Adani Green News: గత నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్ద కుదుపుకు గురిచేసిన అంశం అదానీ గ్రూప్ సోలార్ ఎనర్జీ డీల్స్ విషయంలో లంచాల వ్యవహారం. అయితే అమెరికా కోర్టు ఈ విషయంలో అదానీని ప్రస్తుతం వెంటాడుతోంది. అయితే అందరూ దీనిని స్వల్పంగా మర్చిపోతున్నప్పటికీ దర్యాప్తు మాత్రం చాపకింద నీరుగా వేగంగా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో అదానీపై కేసు మరింతగా బలపడుతోందని ప్రస్తుత పరిణామాలను నిశితంగా మనిస్తే తెలుస్తోంది.

ఈ ఏడాది అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ షేర్లు దాదాపు 26 శాతానికి పైగా క్షీణతను చూశాయి. అలాగే వారం మెుదటి రోజు అంటే సోమవారం కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం పతనాన్ని చూశాయి. అయితే తాజాగా స్టాక్ పతనాన్ని ప్రేరేపిస్తూ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ప్రపంచ కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ లంచాలను అందించారు అనటానకి సాక్ష్యాలుగా నిలిచే డాక్యుమెంట్లు ఉన్నట్లు అమెరికా వెల్లడైంది. అయితే అదానీని ఎప్పుడైనా విచారణకు అప్పగించే అవకాశం లేదని రాయిటర్స్ నివేదించింది. ప్రస్తుతం అదానీ గ్రీన్ స్టాక్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటం వల్ల మార్కెట్ క్యాప్ సోమనారం రూ.1.85 లక్షల కోట్లకు పడిపోయింది.

US seem to have supporting documents in Gautam Adani s Bribery Case Adani Green Stock Fell

సోమవారం మార్కెట్ల ముగింపు సమయంలో షేర్ ధర 2.66 శాతం క్షీణించి ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.1166.50 వద్ద స్థిరపడ్డాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నేరారోపణలో లేదా సివిల్ ఫిర్యాదులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వ్నీత్ జైన్‌లు ఎఫ్‌సీపీఎను ఉల్లంఘించినట్లు ఎటువంటి అభియోగాలు మోపలేదని అదానీ గ్రీన్ నవంబర్ చివరలో తెలిపింది. అమెరికా నేరారోపణలో అజూర్ & CDPQ అధికారులు మాత్రమే లంచం తీసుకున్నారని, అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లపై ఎలాంటి లంచం ఆరోపణలు లేవని అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది.

ప్రధానంగా అదానీ లంచాల వ్యవహారం దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. దీనికి తోడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 2021-22 మధ్య కాలంలో భారతీయ అధికారులకు దాదాపు 265 మిలియన్ డాలర్ల మేర లంచాలు ముట్టాయని అమెరిగా తన అభియోగపత్రాల్లో పేర్కొంది. ఇందులో సింహభాగం అంటే 228 మిలియన్ డాలర్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కంపెనీలను ప్రభావితం చేసేందుకు లంచాలుగా చెల్లించినట్లు ప్రధాన ఆరోపణల్లో ఉంది. పైగా ఏపీ ప్రభుత్వం అదానీ నుంచి దాదాపు 7 గిగావాట్ల మేర సౌరవిద్యుత్ కొనుగోలు చేసేందుకు మెగా డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోని విద్యుత్ రంగ నియంత్రణ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ని ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేయడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా పవర్ డెవలపర్‌గా ఎలా ప్రత్యామ్నాయం చేయబడిందో వివరించాలని కోరింది.

ఏపీకి జరుగుతున్న నష్టం..
అదానీపై లంచం ఆరోపణలకు కేంద్రంగా ఉన్న గుజరాత్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీకి సరఫరా చేయబడే విద్యుత్ kWhకి రూ.2.49 చౌకగా అందుబాటులో ఉండని వెల్లడైంది. ఇక్కడ సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్‌లపై విధించే ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయబడుతుందని డీల్ పత్రాల ప్రకారం బయటపడింది. దీని కారణంగా విద్యుత్ టారిఫ్ కిలోవాట్ కి అదనంగా 50 పైసలు పెరగనుంది. అంటే కిలోవాట్ ధర రూ.2.49 నుంచి రూ.3.069కి పెరగనుంది. అంటే దీని ప్రకారం ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు అదనంగా మరో రూ.850 కోట్లు సమర్పించుకోవాల్సిందేనని వెల్లడైంది. వాస్తవానికి ఇది ప్రజలపై మరింత భారాన్ని మోపవచ్చని తెలుస్తోంది.

అదానీ గ్రీన్ ఎక్స్ఛేంజీలలో విద్యుత్తు అధిక ధరలకు విక్రయిస్తోంది. ఏపీకి సరఫరా ఆలస్యం జరిగినప్పటికీ అదే ప్రాజెక్ట్ నుంచి విద్యుత్‌ను విక్రయిస్తోంది. యూనిట్‌కు సగటున రూ.3.5 ధరగా విక్రయం జరుగుతోంది. ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న సోలార్‌ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అంగీకరించిన యూనిట్‌కు రూ.2.42 కంటే ఇది 40 శాతం అధికం. ఇదే క్రమంలో అదానీ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో.. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+