US Sanctions: ఇటీవల అమెరికా కొత్త అధ్యక్షుడి పదవిలో బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రోజురోజుకూ తన పరిపాలన స్పీడ్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలను ఆయన టార్గెట్ చేస్తున్నారని వెల్లడైంది. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న ట్రంప్ సర్కార్ మరిన్ని చర్యలతో ముందుకొస్తోంది.
తాజాగా అమెరికా భారదేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించింది. సదరు కంపెనీలు ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం మరియు రవాణాలో పాల్గొన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు వచ్చాయి. ఇరాన్ పై గరిష్ఠ ఒత్తిడిని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సోమవారం వివిధ దేశాల్లోని 30 మందికి పైగా వ్యక్తులు, నౌకలపై ఆంక్షలు విధించటం పెను సంచలనంగా మారింది. ఇందులో భారతదేశానికి సంబంధించిన నాలుగు సంస్థలు ఉండటం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది.

అమెరికా సంస్థలు అందించిన వివరాల ప్రకారం నవీ ముంబైకి చెందిన ఫ్లక్స్ మారిటైమ్ LLP, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆధారిత బీఎస్ఎమ్ మెరైన్ LLP, ఆస్టిన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, తంజావూరుకు చెందిన కాస్మోస్ లైన్స్ ఇంక్ సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించిందని వెల్లడైంది. ఈ కంపెనీల్లో మూడు ఇరానియన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నౌకల వాణిజ్య లేదా సాంకేతిక నిర్వాహకులుగా ఉన్నందుకు ఆంక్షలు విధించబడ్డాయని వెల్లడించబడింది. అయితే కాస్మోస్ లైన్స్ మాత్రం ఇరాన్ పెట్రోలియం రవాణాలో పాల్గొన్నందుకు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చినట్లు వెల్లడైంది.
నేడు అమెరికా నుంచి ఆంక్షలు విధించబడిన వాటిలో యూఏఈ, హాంకాంగ్‌లోని చమురు బ్రోకర్లు, భారతదేశంలోని ట్యాంకర్ ఆపరేటర్లు, మేనేజర్లతో పాటు ఇరానియన్ ఆయిల్ కంపెనీ అధిపతి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇరానియన్ ఆయిల్ టెర్మినల్స్ కంపెనీలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంక్షలను ఎదుర్కొన్న నౌకలు వందల మిలియన్ల డాలర్ల విలువైన పది లక్షల బ్యారెళ్ల చమురును రవణాకు దోహదపడినట్లు అమెరికా గుర్తించింది.
ఈ క్రమంలో భారతీయ కంపెనీలు ఇలాంటి వాటి కింద ఆంక్షలకు గురికావటం ఇదే మెుదటి సారి కాదు. గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశానికి చెందిన గబ్బారో షిప్ సర్వీసెస్ ఇరానియన్ చమురు రవాణాలో పాల్గొన్నందుకు అనుమతి పొందింది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో రష్యాకు చెందిన ఆర్కిటిక్ LNG 2 ప్రాజెక్ట్ నుండి LNG రవాణాలో పాల్గొన్నందుకు మూడు భారతదేశంలో నమోదైన షిప్పింగ్ సంస్థలను అమెరికా ఆంక్షలు విధించిందని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్యలు మరింత కఠినతరంగా మారుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications