Flipkart News: అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా మార్కెట్లో దూకుడు పెంచేసింది. అమెజాన్ ఆటకట్టించేందుకు ఆయుధాలు ఎక్కుపెట్టింది.
ఇండియాలో ఫిప్‌కార్ట్ లో వాటాల కొనుగోలు ద్వారా ఈ-కామర్స్ వ్యాపారంలో వాల్‌మార్ట్ ముందుకు సాగుతోంది. దేశంలోని 99 శాతం స్టార్టప్ కంపెనీల్లో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 77 శాతం వాటాలను 2018లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మెజారిటీ వాటాదారుగా ఉన్నప్పటికీ కంపెనీని పూర్తిగా సొంతం చేసుకోవాలని నిర్ణయించింది.

తాజాగా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభ పెట్టుబడిదారులైన యాక్సెల్, టైగర్ గ్లోబల్ నుంచి వాటాలను కొనుగోలు చేసింది. అలాగే సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తన వాటాను పూర్తిగా ఉపసంహరించుకున్నారు. దీంతో మెుత్తం 35 బిలియన్ డాలర్లు వెచ్చించి పెద్ద ఇన్వెస్టర్ల నుంచి వాటాలను అమెరికా రిటైలర్ కొనుగోలు చేసింది. తన వాటాలను విక్రయించటం ద్వారా టైగర్ గ్లోబల్ సుమారు 3.5 బిలియన్ డాలర్ల లాభాన్ని వెచ్చించిందని వెల్లడైంది. అలాగే బిన్నీ బన్సల్ సుమారు 1-1.5 బిలియన్ డాలర్లను సంపాదించినట్లు సమాచారం.

ఫిప్‌కార్ట్ భవిష్యత్తుపై తాము నమ్మకంగా ఉన్నామని వాల్‌మార్ట్ ప్రతినిధి తెలిపారు. మొదట పెట్టుబడి పెట్టినప్పుడు కంటే ఈ రోజు భారతదేశంలో అవకాశాల గురించి మరింత సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన, స్థిరమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించడం ద్వారా.. ఫ్లిప్‌కార్ట్ అభివృద్ధి చెందుతున్న, డైనమిక్ మార్కెట్‌లో వృద్ధిని కొనసాగించేలా చేస్తుందని పేర్కొన్నారు. 2007లో భారత స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ ప్రస్థానం వాటాలు చేతులు మారినతర్వాత అమెరికా యాజమాన్యంలోని కంపెనీగా మారిపోయింది.


Click it and Unblock the Notifications