Walmart Imports: అమెరికాలో అతిపెద్ద రిటైల్ స్టోర్ల చైన్ కలిగి ఉన్న వాల్‌మార్ట్ చాలా కాలంగా భారత మార్కెట్ పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెజాన్ ఇండియాతో పోటీ పడేందుకు ఫిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది.
ప్రస్తుతం అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ భారతదేశం నుంచి దాని దిగుమతులను గణనీయంగా పెంచుతోంది. కంపెనీ తన గ్లోబల్ సోర్సింగ్ వ్యూహంలో ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా నుంచి తన దిగుమతులను తగ్గించటం భారత మార్కెట్లకు అనుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. వాల్‌మార్ట్ బలమైన లాజిస్టిక్స్ .. కేవలం ఒక్క సప్లయర్ పైనే ఎక్కువగా ఆధారపడుకుండా ఉండేందుకు భౌగోళికంగా తీసుకున్న ప్రణాళికలో భాగంగా తాజా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వాల్‌మార్ట్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా ఆల్బ్రైట్ పేర్కొన్నారు.

భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ గణనీయమైన పెట్టుబడి, 2027 నాటికి ఇండియా నుంచి ఏడాదికి 10 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించటం మన మార్కెట్లపై వాల్‌మార్ట్ ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా నుంచి వాల్‌మార్ట్ దిగుమతులు ఏడాదికి 3 బిలియన్ డాలర్లుగా ఉంది.
భారత ఆర్థిక దృక్పథం, సానుకూల మార్కెట్ సూచికలు, భారీ స్థాయిలో తక్కువ-ధర తయారీ సామర్థ్యాలు వాల్‌మార్ట్ ను ఆకర్షిస్తోంది. బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, సైకిళ్లు, ఔషధాల వంటి సోర్సింగ్ ఉత్పత్తుల విషయంలో చైనాకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా ఇండియా మారటం షిఫ్ట్ వెనుక కీలకంగా నిలిచింది. అలాగే కంపెనీకి భారత ప్రభుత్వంతో మంచి రిలేషన్ పెంచుకుంటోంది. అలాగే వాల్‌మార్ట్ CEO భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పెట్టుబడి ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications