US GDP: ప్రపంచ పెద్దన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం మిగిలిన దేశాలకు చాలా కీలకం. అందుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల కోసం అందరూ ఆసక్తిగా పరిశీలిస్తుంటారు.
రెండు రోజుల కిందట యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్య లిక్విడిటీని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని మరింతగా అదుపుచేసేందుకు దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఇదే క్రమంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం అగ్రరాజ్య ఫార్ములానే నమ్ముకుంది. తాజాగా 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచింది. దీంతో 2001 తర్వాత ఈయూ చరిత్రలో వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరుసగా తొమ్మిదోసారి కీలక వడ్డీ రేట్లను పెంచటం ఆందోళనలకు దారితీస్తోంది. రానున్న కాలంలో సైతం ఇవి కొనసాగుతాయని తాజా సమావేశంలో చెప్పకనే చెప్పింది. ఈ రెండు దేశాల మార్కెట్లు భారత ఐటీ కంపెనీలకు చాలా కీలకమైనవి. మెజారిటీ వ్యాపారాన్ని భారత టెక్ సేవల కంపెనీలు ఇక్కడి నుంచే పొందుతున్నాయి. ఇక్కడి నుంచి ఆదాయాలు, ప్రాజెక్టులు తగ్గితే అది నేరుగా భారత జీడీపీపై పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ మధ్య రెండవ త్రైమాసికంలో 2.4% వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నందున స్థిరంగా పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో వాణిజ్య శాఖ అంచనాలు ఊహించని స్థితిస్థాపకతను చూపించాయి. అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికాలో GDP వృద్ధి 2023 మొదటి మూడు నెలల్లో 2% రేటు నుంచి పెరిగి ఇది విశ్లేషకుల అంచనాలను మించిపోయింది.


Click it and Unblock the Notifications