కరోనా మహమ్మారిపై పోరులో మిత్రదేశాలకు సాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది. వెంటిలెటర్లు, ఇతర వైద్య సామాగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతో పాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనాపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు ట్రంప్. వెంటిలెటర్లు పంపించాలని ట్రంప్ కోరారని, రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలెటర్లు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

మా అవసరాలతో పాటు దేశాలకు సహకరిస్తాం
బ్రిటన్‌తో పాటు ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాలకు వెంటిలెటర్స్ అవసరం ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ దేశాధిపతులు అందరూ వెంటిలెటర్స్ కోసం ఫోన్లు చేస్తున్నారన్నారు. మరిన్ని వెంటిలెటర్లు తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మా అవసరాలతో పాటు ఇతర దేశాలకు కూడా సహకరిస్తామన్నారు. రానున్న వంద రోజుల్లో లక్షకు పైగా వెంటిలెటర్స్ తయారు చేస్తామన్నారు.

టైమ్ వేస్ట్ కాదు.. వెంటిలెటర్లు తయారు చేయండి
అమెరికా, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ సహా ప్రపంచమంతా ఇప్పుడు కరోనా బారిన పడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఆటో సహా అన్ని ఉత్పత్తులు నిలిచిపోయాయి. టాప్ కార్ల దిగ్గజం జనరల్ మోటార్స్‌పై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. టైమ్ వేస్ట్ చేయవద్దని, జనరల్ మోటార్స్ వెంటిలెటర్లు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అమెరికన్ల జీవితాలు కాపాడాల్సిన సమయం
ఆటోమొబైల్ ఉత్పత్తులు నిలిచిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ మోటార్స్ సమయాన్ని వృధా చేస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికన్ల జీవితాలు కాపాడాల్సిన ఉందని చెప్పారు. లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని, 2వేలకు పైగా మంది మృతి చెందారని, వెంటిలెటర్లు తయారు చేయాలన్నారు. జనరల్ మోటార్స్ ప్లాంట్ ఓపెన్ చేసి వెంటిలెటర్లు వెంటనే సిద్ధం చేయాలని, పోర్డ్ కూడా ఇలాగే చేయాలన్నారు.


Click it and Unblock the Notifications