S&P Global: అమెరికా నుంచి శుభవార్త.. భారత జీడీపీ వృద్ధి అంచనాలు పెంచిన S&P గ్లోబల్..

India's GDP: దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థ గురించి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వార్త వచ్చింది. వారం మెుదటి రోజున అమెరికా ప్రఖ్యాత గ్లోబల్ రేటింగ్ సంస్థ తన అంచనాలను ప్రకటించింది.

S&P గ్లోబల్ భారత జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటును 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. గతంలో ఇది 6 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకుని వృద్ధి రేటు అంచనాను 40 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. ఈ నివేదిక దేశీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థకు మంచి మద్దతు లభిస్తోంది.

US rating agency S&P Global increased indias GDP FY24 forecast at 6.4 percent

ఏజెన్సీ తన ఎకనామిక్ ఔట్‌లుక్ ఆసియా-పసిఫిక్ క్యూ1 2024: ఎమర్జింగ్ మార్కెట్స్ లీడ్ ది వే' నివేదిక సోమవారం విడుదల చేసింది. ఇందులో సవరించిన వృద్ధి అంచనాలను S&P Global ప్రచురించింది. దేశీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరు ఆర్థిక వ్యవస్థలో ఉన్న అడ్డంకులను తొలగించింది. FY 24కి తన వృద్ధి అంచనాను పెంచినప్పటికీ.. FY24-25 కాలంలో జీడీపీ అంచనాను 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది.

ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. ఈ సంకేతాలు ఉన్నందున ఎఫ్‌వై 25లో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రైవేట్ వినియోగదారుల వ్యయం కంటే దేశంలో స్థిర పెట్టుబడులు ఎక్కువగా పుంజుకున్నాయని పేర్కొంది. ఇదే క్రమంలో FY 26కి భారత GDP వృద్ధి రేటు అంచనాను 6.9 శాతంగా ఉంచింది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం కంటే ఎక్కువగా కొనసాగుతున్న తరుణంలో వడ్డీ రేట్ల తగ్గింపుకు మరికొంత సమయం పడుతుందని S&P పేర్కొంది.

రాబోయే నెలల్లో దేశీయ డిమాండ్ బలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై స్పాట్‌లైట్ కొంచెం ప్రకాశవంతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+