Adani: అదానీ కంపెనీలు దాదాపు 80 శాతం వరకు మార్కెట్ విలువను కోల్పోయిన తరుణంలో విదేశాల నుంచి ఒక శుభవార్త వచ్చింది. ఇది గౌతమ్ అదానీతో పాటు అదానీ గ్రూప్ లోని ఒక కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లకు ఊరటను ఇస్తోంది.

రిలీఫ్ న్యూస్..
హిండెన్ బర్గ్ వివాదం అదానీకి తర్వాత దెబ్బ మీద దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం మాత్రం అదానీ గ్రీన్ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటను అందించనుంది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P అదానీ గ్రూప్‌కు ఉపశమనం ఇస్తూ అదానీ గ్రీన్‌ను వాచ్ లిస్ట్ నుంచి తొలగించింది.

అదానీ గ్రీన్ రేటింగ్..
అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ S&P అదానీ గ్రీన్ ఎనర్జీపై BB+ రేటింగ్‌ను కొనసాగించింది. ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతోంది. ఏజెన్సీ డిసెంబర్ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీని క్రైటీరియన్ అబ్జర్వేషన్ కింద ఉంచింది. ప్రస్తుతం రేటింగ్ తర్వాత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పూర్తిగా సురక్షితమైనవిగా తెలుస్తోంది. కంపెనీ రుణాలు పూర్తిగా సురక్షితమైనవని రేటింగ్ సంస్థ ధృవీకరించింది.

కంపెనీ షేర్ ధర..
AGEL RG2 మూడు ఆపరేటింగ్ ఎంటిటీలను కలిగి ఉంది. వార్ధా సోలార్ (మహారాష్ట్ర) లిమిటెడ్, కొడంగల్ సోలార్ పార్క్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ (RJ) లిమిటెడ్. ఈ సంస్థలు $362.5 మిలియన్ సీనియర్ సెక్యూర్డ్ ఫిక్స్‌డ్-రేట్ 20కి సహ-ఇష్యూయర్‌లు, సహ-గ్యారంటీదారులు. ఈ మూడు కలిపి దేశంలో 570 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 సోలార్ ఆస్తుల పోర్ట్ ఫోలియోను కలిగి ఉన్నాయి, నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ముగిసే సమయానికి అదానీ గ్రీన్ స్టాక్ ధర 5 శాతం మేర నష్టపోయి రూ.486.50 వద్ద ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications