TotalEnergies: అదానీ లంచాల కుంభకోణంలో తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ కంపెనీలో టోటల్ ఎనర్జీ పెట్టుబడుల వ్యవహారంపై కూడా పెద్ద చర్చ కొనసాగుతోంది.
గౌతమ్ అదానీ-సాగర్ అదానీలు భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పార్క్‌లో కొంత భాగాన్ని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల్లో భాగంగా అదానీకి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలో ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టే సమయానికి అదానీకి అమెరికాలో అనుమానాస్పద లంచాల గురించి దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలుసని ప్రాసిక్యూటర్లు వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ చూసిన చట్టపరమైన పత్రాల్లో ఉన్నట్లు వెల్లడించింది. సదరు విదేశీ సంస్థ ఖవ్దా సోలార్ వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆరోపించిన లంచం, మోసం స్కీమ్‌పై యూఎస్ అధికారులు అదానీలను విచారిస్తున్నారని తమకు తెలుసా అనే దానిపై వివరణ కోసం శుక్రవారం చేసిన అభ్యర్థనకు టోటల్ ఎనర్జీస్ వెంటనే స్పందించలేదు.

సోలార్ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి 2024 మధ్య కాలంలో భారతీయ అధికారులకు వాగ్దానం చేసి, ఆ తర్వాత అక్రమ చెల్లింపులు చేశారని, భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కి చెందిన మాజీ సీఈవో సహా 8 మందిపై US ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. సెప్టెంబర్ 2024లో ఖవ్దా సోలార్ పార్క్‌లో 1.15 గిగావాట్ల సోలార్ ఇన్‌స్టాలేషన్‌లలో 50% వాటా కోసం అదానీ గ్రీన్ ఎనర్జీతో జాయింట్ వెంచర్‌లో టోటల్‌ఎనరీజెస్ 444 మిలియన్ డాలర్లు చెల్లించింది. వాస్తవానికి ఇది లంచం ఆరోపణలకు కేంద్రంగా ఉన్న ప్రాజెక్ట్. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న క్రిమినల్ కేసులో ఫ్రెంచ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ పేరు లేదు. అయితే ఈ మెుత్తం వ్యవహారంపై అదానీ గ్రూప్ ఆరోపణలను పూర్తి నిరాధారమైనవిగా పేర్కొంది.
నేరారోపణల ప్రకారం FBI ప్రత్యేక ఏజెంట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీకి సెర్చ్ వారెంట్, గ్రాండ్ జ్యూరీ సబ్‌పోనాతో మార్చి 2023లో సేవలందించారు. టోటల్‌ఎనర్జీస్‌కు విక్రయించడానికి ఒక సంవత్సరం కంటే ముందు. ఈ పత్రాలు అదానీ గ్రీన్ ఎనర్జీ దాని మాజీ CEO వినీత్ జైన్, చైర్మన్ గౌతమ్ అదానీ సంస్థకు వ్యాపార ప్రయోజనాలను పొందేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై విచారణలో ఉన్నట్లు గుర్తించారు. టోటల్ ఎనర్జీస్ జనవరి 2021లో అదానీ గ్రీన్ ఎనర్జీలో 20% వాటాను కొనుగోలు చేసింది. మెుత్తానికి అదానీపై కొనసాగుతున్న లంచాల ఆరోపణలు దాని ఇతర ఇన్వెస్టర్ల మెడకు చుట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications