అంతర్జాతీయ విపణిలో భారత్ సత్తాను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ఒకానొక సమయంలో బ్రిటీషర్స్ పాలనలో మగ్గిన ఇండియా.. ప్రస్తుతం వివిధ దేశాలను, దిగ్గజ సంస్థలను నడిపించడంలో ముందుంది. ఇటీవల యూట్యూబ్ సారధిగా భారతీయ మూలాలున్న నీల్ మోహన్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్ని మరో ఇండో-అమెరికన్ అధిరోహించనుండటం దాదాపు ఖాయమైంది. ఓ భారతీయుడు ఏకంగా ప్రపంచాన్నే నడిపిచడానికి సమయం ఆసన్నమైంది.

భారత్ లో పెరిగిన కారణంగా..
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగాను అమెరికా నామినేట్ చేసినట్లు ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ప్రపంచ సంస్థను నడిపించడానికి ఆయన సమర్థుడని తెలిపారు. భారత్ లో పెరిగిన కారణంగా.. అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృక్పథం ఉన్నట్లు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచ బ్యాంకును ఎలా ముందుకు నడిపించాలో ఆయనకు తెలుసన్నారు.

దిగ్గజ కంపెనీల నిర్వహణలో దిట్ట:
"మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచ దిగ్గజ కంపెనీల నిర్వహణలో అజయ్ దిట్ట. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడులు అందించడంలో, కీలక మార్పుల విషయమై మార్గనిర్దేశం చేయడంలోనూ అనుభవం ఉంది. ప్రపంచ శ్రేణి నాయకులతో మంచి సంబంధాలున్నాయి. వాతావరణ మార్పులతో సహా అత్యంత దుర్భర సవాళ్లను పరిష్కరించడంలో భాగంగా.. పబ్లిక్-ప్రైవేట్ వనరులు సమీకరించడంలోనూ అందె వేసిన చేయి" అని అమెరికా అధ్యక్షులు బైడెన్ వివరించారు.

పద్మశ్రీ గ్రహీత:
జనరల్ అట్లాంటిక్ సంస్థకు ప్రస్తుతం వైస్ ఛైర్మన్ గా బంగా పనిచేస్తున్నారు. 2021లో అదే సంస్థకు చెందిన క్లైమేట్-ఫోకస్డ్ ఫండ్, బియాండ్ నెట్ జీరో విభాగాలకు సలహాదారులుగా ఉన్నారు. గతంలో మాస్టర్ కార్డ్ కంపెనీ CEOగానూ సేవలందించారు. వ్యూహాత్మక, సాంకేతిక, సాంస్కృతిక మార్పుల ద్వారా సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో టెక్నాలజీ, డేటా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవేటింగ్‌లలో గ్లోబల్ లీడర్ గా ఆయనకు మంచి పేరుంది. 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

అంతర్జాతీయ సంస్థల్లో అనుభవం:
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి 2020-2022లో గౌరవాధ్యక్షులుగా, ఛైర్మన్ గా అజయ్ పనిచేశారు. అమెరికన్ రెడ్‌క్రాస్, క్రాఫ్ట్ ఫుడ్స్ మరియు డౌ ఇంక్ బోర్డులలో సేవలందించారు. ఎక్సోర్ కు ఛైర్మన్ గా, టెమాసెక్ లో స్వతంత్ర డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ కు ఛైర్మన్ ఎమెరిటస్. సెంట్రల్ అమెరికా భాగస్వామ్యానికి ఏర్పాటైన త్రైపాక్షిక కమిషన్ సభ్యుల్లో ఆయన ఒకరు. అంతేగాక US-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వ్యవస్థాపక ధర్మకర్త, US-చైనా సంబంధాల జాతీయ కమిటీలో మాజీ సభ్యులు.

పలు అవార్డులు సొంతం:
అంతేకాక సైబర్ రెడీనెస్ ఇనిస్టిట్యూట్ కు బంగా సహ వ్యవస్థాపకులు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ వైస్ ఛైర్ మరియు నేషనల్ సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి బరాక్ ఒబామా కమిషన్ లో సభ్యునిగా పనిచేశారు. వాణిజ్య విధానంపై చర్చల కోసం US అధ్యక్షుడి సలహా కమిటీలోనూ గతంలో ఆయన సభ్యులే. 2012లో ఫారిన్ పాలసీ అసోసియేషన్ మెడల్, ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్, బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ యొక్క గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డ్, 2019 మరియు 2021లో డిస్టింగ్విష్ ఫ్రెండ్స్ ఆఫ్ సింగపూర్ పబ్లిక్ సర్వీస్ స్టార్ అవార్డులను అందుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications