Blackstone: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత పెట్టుబడి సంస్థల చూపు ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లపై పడింది. ఈ క్రమంలో అభివృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో మెండుగా పెట్టుబడులను పెడుతున్నాయి.
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్.. ఇండియాలోని కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అది కేరళలోని ప్రముఖ హాస్పిటల్ చైన్ కిమ్స్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో 75% వరకు వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ రూ.4,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది సెప్టెంబర్ మధ్య నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

బ్లాక్‌స్టోన్ ప్రస్తుత పెట్టుబడిదారు ట్రూ నార్త్ వద్ద ఉన్న 55% వాటాను, మైనారిటీ వాటాదారుల వద్ద ఉన్న 20% వాటాను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన 25% వాటా డాక్టర్ MI సహదుల్లా నేతృత్వంలోని వ్యవస్థాపక కుటుంబం వద్ద ఉంటుంది. ఇదే క్రమంలో హాస్పిటల్ కొనుగోలుకు మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్, మాక్స్ హెల్త్‌కేర్, టెమాసెక్ యాజమాన్యంలోని షీర్స్ హెల్త్‌కేర్, CVC క్యాపిటల్ ప్రారంభ దశ చర్చలు జరుపుతూ పోటీలో ఉన్నాయి.
2002లో స్థాపించబడిన కిమ్స్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, కేరళలో మొత్తం 1,378 పడకల సామర్థ్యంతో నాలుగు ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఇది తిరువనంతపురంలో మూడు వైద్య కేంద్రాలను, నర్సింగ్ కళాశాలను కూడా నడుపుతోంది. తిరువనంతపురం సౌకర్యం కంపెనీ నిర్వహణ ఆదాయంలో 72%, FY22లో దాని నిర్వహణ లాభంలో 82.8% వాటాను కలిగి ఉంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications