Tech Layoffs: 3000 మందికి ఆ టెక్ కంపెనీ మంగళం.. 2024లో మెుదలైన లేఆఫ్స్..
IT News: సంవత్సరం మారినా టెక్ ఉద్యోగుల ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. రోజులు గడిచే కొద్ది మరిన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించే పనిని ముమ్మరం చేస్తున్నాయి. దీంతో 2024లో టెక్ లేఆఫ్స్ మళ్లీ మెుదలయ్యాయి. న్యూఇయర్ సంతోషం ఒక్కదెబ్బకు ఆవిరైపోతోంది.
ప్రపంచ దిగ్గజమైన డిజిటల్ ప్రింటింగ్ అండ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ సంస్థ జెరాక్స్ తాజాగా ఉద్యోగుల లేఆఫ్స్ గురించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దాదాపు 15 శాతం అంటే 3000 మంది ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. కొత్త సంస్థాగత నిర్మాణం, ఆపరేటింగ్ మోడల్‌ను పరిచయం చేసే ప్రణాళికలో భాగంగా తాజా తొలగింపులు వస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త ఎగ్జిక్యూటివ్ నాయకత్వ జాబితాను కూడా కంపెనీ ప్రకటించింది.

వాస్తవానికి గత ఏడాది చివరి నాటికి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ప్రకటించిన ఉద్యోగుల తొలగింపులు ఈ త్రైమాసికంలో పూర్తిచేయాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ చేసిన తాజా ప్రకటనతో షేర్ ధర 12 శాతానికి పైగా పడిపోయాయి. ప్రపంచ వ్యాపార సేవలలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, IT, ఇతర డిజిటల్ సేవలపై కంపెనీ దృష్టిని పెంచడం వంటివి ఉన్నాయి.
జిరాక్స్ రీఇన్వెన్షన్ పరిణామం కంపెనీలోని మానవ వనరులను మూడు కీలక రంగాల్లో సమలేఖనం చేస్తుందని సీఈవో స్టీవెన్ బాండ్రోక్జాక్ పేర్కొన్నారు. కంపెనీ ప్రాధాన్యత తమ ప్రింటింగ్ వ్యాపారాన్ని మెరుగుపరిచి స్థిరీకరించిచటంతో పాటు, కొత్త గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం అని పేర్కొన్నారు. ఇక చివరగా ఈ నిర్ణయం ద్వారా ఆదాయ వైవిధ్యీకరణలో క్రమశిక్షణతో కూడిన అమలు ఉందన్నారు.


Click it and Unblock the Notifications