America-Iran: చూస్తూ ఊరుకోం.. ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేసిన ట్రంప్..!
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కీలకమైన హర్ముజ్ జల సంధిలో నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకార చర్యగా శనివారం ఇరాన్‌కు చెందిన అనే స్థావరాలపై అమెరికా బలగాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందించారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించినందుకు, అమెరికా విమానాలు ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ స్థావరాలపై దాడి చేశాయని ప్రకటించారు.
జూన్ 17న అమెరికా ఇరాన్ మధ్య ఒప్పంద జరిగింది. ఆ తర్వాత హర్మూజ్ జల సంధి గుండా వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా రాకపోకాలు సాగిస్తున్నాయి. అంత బాగానే ఉందనుకున్న సమయంలో చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. దాదాపు రెండు మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్తున్న పనామా జెండా గల 'కికు' అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా శనివారం దాడులు జరిపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అందుకే ప్రతి దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ నిఘా మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాయు రక్షణ స్థావరాలు, డ్రోన్ నిల్వ ఉన్న గోధాములను టార్గెట్ చేస్తూ యూఎస్ బలగాలు దాడులు చేశారు.

దక్షిణ ఇరాన్‌లోని సిరిక్, ఖేష్మ్ ప్రాంతాలలో అనేక పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. శుక్రవారం ఎవర్ లవ్లీ అనే ఓడపై ఇరాన్ జరిపిన దాడికి ప్రతిస్పందనగా అమెరికా కూడా దాడులు జరిపినట్లు తెలిపింది. గల్ఫ్‌లోని యూఎస్ లక్ష్యాలపై తమ ప్రతీకార చర్యగా దాడి చేసినట్లు ఇరాన్ శనివారం వెల్లడించింది. శనివారం తెల్లవారుజామున తమను అనేక ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని వివరించింది. అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలను ఇరాన్ భగ్నం చేస్తోందని బహ్రెయిన్ ఆరోపించింది.
మరోపక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. హిజ్బుల్లా నాయకుడు నయీమ్ ఖాసెమ్ ఒప్పందాన్ని నిరాకరించడంతో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న విస్తృత శాంతి ప్రయత్నాలకు కూడా విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.
అనుమతి లేకుండా జలసంధి ద్వారా గల్ఫ్‌లోకి ప్రవేశించవద్దని, బయటకు వెళ్లవద్దని ఇరాన్ హెచ్చరించింది. అయినా కొన్ని నౌకలు టెహ్రాన్ ఆమోదించని మార్గాన్ని ఉపయోగిస్తూ తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నాయని పేర్కొంది.
తాజాగా అమెరికా, ఇరాన మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ హర్ముజ్ జల సంధి ద్వారా రవాణా పుంజుకుంటుందనే ఆశలతో చమురు ధరలు తీవ్రంగా పడిపోయాయి. మరోపక్క ఇరాన్ చమురుపై అమెరికా విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. దీంతో ప్రపంచ మార్కెట్ లోకి ఇరాన్ చమురు రానుంది.


Click it and Unblock the Notifications