Trump News: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఖరారైన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ట్రంప్ వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టడానికి మునుపే అనేక క్రిప్టోలు భారీ ర్యాలీని నమోదు చేశాయి. ట్రంప్ ఎన్నికల వాగ్ధానంలో భాగంగా క్రిప్టో కరెన్సీలకు ప్రాధాన్యతను అందిస్తున్నట్లు ప్రస్తుత చర్యలను చూస్తుంటే అర్థం అవుతోంది.
వివరాల్లోకి వెళితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మూడు క్రిప్టో కరెన్సీల పేర్లను ఎంపిక చేసుకున్నారు. వీటి ద్వారా యూఎస్ క్రిప్టో స్ట్రాటజీ రిజర్వును ఆదివారం ప్రకటించారు. ఇందులో రిపుల్, సోలానా, కార్డానోలు ప్రణాళికలో ఎంపికయ్యాయి. ఈ ప్రకటనతో ఒక్కసారిగా మార్కెట్లలో మెగా ర్యాలీ నెలకొంది. ఈ డిజిటల్ కరెన్సీల ధరలు దాదాపు 10 నుంచి 35 శాతం మధ్య భారీ పెరుగుదలను చూశాయి.

డిజిటల్ ఆస్తుల కోసం వ్యూహాత్మక రిజర్వ్‌ను ఏర్పాటు చేయాలని అధ్యక్ష వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించిన ట్రంప్ జనవరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత తాజా చర్య తీసుకున్నారు. అమెరికాను "క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్"గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా.. మోసాలను నివారించటం, మనీలాండరింగ్ నిరోధక చర్యలపై దృష్టి సారించిన మునుపటి పరిపాలన నియంత్రణ చర్యల నుంచి ట్రంప్ పూర్తిగా నిష్క్రమించినట్లు సంకేతాలు ఇచ్చారు.
ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీల రేట్లు భారీగా క్షీణించినప్పటికీ.. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ విధాన మార్పు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి రేకెత్తించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు లేదా మరింత అనుకూల క్రిప్టో చొరవలతో జతచేయబడితే ఇది మరింత జోష్ నింపే అవకాశాలు ఉన్నాయి. అయితే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ ఖచ్చితమైన నిర్మాణం అస్పష్టంగానే ఉంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరమా లేదా US ట్రెజరీ ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అమలు చేయవచ్చా అనే అంశాలపై న్యాయ నిపుణులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. చట్ట అమలు చర్యల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆస్తులను రిజర్వ్‌లో చేర్చవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
దీనిని ముందు గడచిన శుక్రవారం ట్రంప్ మొట్టమొదటి వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహించటం గమనార్హం. దీని ద్వారా ట్రంప్ తన పరిపాలన సమయంలో క్రిప్టోలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో అందరి దృష్టి రాబోయే నియంత్రణ పరిణామాలు, పరిశ్రమపై వాటి ప్రభావంపై కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications