భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. గడువు ముగియడానికి ఒక రోజు ముందు మరోసారి చైనాపై తన వ్యూహాత్మక వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.ఈ నేపథ్యంలోనే చైనా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. చైనాతో మేము మంచి వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాం. వాళ్ల దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి అయితే అంతకు మించి అద్భుతమైన కార్డులు మా దగ్గర ఉన్నాయని తెలిపారు.
ఆ కార్డ్స్ మేము ప్రయోగిస్తే.. చైనా నాశనమవుతుందని తెలిపారు. అయితే వాటితో నేను ఆడను అంటూ చెప్పుకొచ్చారు. వైట్ హౌస్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ పక్కనే కూర్చోని ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా ఆర్థిక, రాజకీయ లేదా వ్యూహాత్మక పావులను ఉపయోగించే అవకాశం ఉందనే స్పష్టమైన సంకేతం కనిపించింది.

అమెరికాకు కీలకమైన అరుదైన అయస్కాంతాల సరఫరాపై చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైన ఈ అయస్కాంతాలను బీజింగ్ అమెరికాకు ఇవ్వకపోతే 200 శాతం వరకు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. వారు మాకు అయస్కాంతాలను ఇవ్వాలి, లేకపోతే మనం వారికి 200 శాతం సుంకం వసూలు చేస్తామని Trump స్పష్టం చేశారు.
అమెరికాకు వచ్చే భారతీయ దిగుమతులపై 50శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి పూర్తిగా అమల్లోకి రానున్నాయి. భారతదేశం రష్యా చమురును విస్తృతంగా కొనుగోలు చేస్తున్నందుకే ఈ చర్య తప్పనిసరైందని ట్రంప్ చెబుతున్నారు. గతంలో రష్యా చమురుతో భారతదేశం వ్యాపారం 1 శాతం కన్నా తక్కువగా ఉండగా, ప్రస్తుతం అది 42 శాతానికి పెరిగింది. దీనివల్ల భారత్ భారీ లాభాలు పొందిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
అయితే, రష్యా చమురుకు చైనానే అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్నప్పటికీ.. ఆ దేశంపై ఇలాంటి కఠిన చర్యలు అమెరికా చేపట్టకపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. దీనిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సమాధానమిస్తూ.. చైనా కొనుగోలు వృద్ధి తక్కువ స్థాయిలోనే ఉంది. రష్యా యుద్ధానికి ముందే చైనాకు వచ్చే చమురులో 13 శాతం రష్యా నుంచే ఉండేది. ఇప్పుడు అది 16 శాతానికి పెరిగింది. కాబట్టి అది వైవిధ్యపరచడమే తప్ప అధిక వృద్ధి కాదని చెప్పారు.
భారతదేశం ఈ చర్యలపై స్పందిస్తూ.. అనేక ఇతర దేశాలు కూడా తమ జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలకు, కేవలం భారత్‌ను మాత్రమే శిక్షించడం అన్యాయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికా విధించిన సుంకాలలో సగం ఈ నెల ప్రారంభంలో అమల్లోకి వచ్చాయి. మిగిలిన సగం బుధవారం నుంచి అమలవుతాయి.
ఈ పరిస్థితుల మధ్య చైనాపై కొత్త సుంకాలు విధించే గడువును ట్రంప్ ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఫెంటానిల్ ఉత్పత్తులపై మాత్రం 20 శాతం అదనపు సుంకం అమలు చేస్తున్నారు. మొత్తంగా చైనా దిగుమతులపై అమెరికా వసూలు చేస్తున్న సుంకాలు ప్రస్తుతం 30 శాతం స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ చైనాతో గొప్ప సంబంధం కొనసాగించాలన్న ఆయన వ్యాఖ్యలు వాణిజ్య విభేదాలను కొంతమేర తగ్గించే ప్రయత్నంగా నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications