Trump News: ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్.. మర్యాదగా వెళ్లిపోతే బంపర్ ఆఫర్.. లాస్ట్ డేట్
US Trump News: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రభుత్వంపై ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6 నాటికి రాజీనామా చేసే ఫెడరల్ ఉద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వైట్ హౌస్ మంగళవారం ఆలస్యంగా ప్రకటించింది.
అవును ట్రంప్ ఉద్యోగానికి రాజీనామా చేసే ఫెడరల్ ఉద్యోగులకు 8 నెలల వేతనాన్ని చెల్లించటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వాస్తవానికి అమెరికా ప్రభుత్వాన్ని పునర్నిర్మించే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలో ఇది భాగంగా వస్తోంది. చాలా మంది ఉద్యోగులు పూర్తి-సమయం కార్యాలయంలో పనికి తిరిగి రావాల్సిన అవసరం ఉందని మెమో వెల్లడించింది. అలాగే ఉద్యోగం వీడాలనుకునేవారికి కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించబడింది.

మెమో ప్రకారం ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌లో ప్రస్తుత పాత్రలో కొనసాగకూడదని ఎంచుకుంటే.. దేశానికి మీరు చేసిన సేవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొనబడింది. దీనిని ఎంచుకునే వారికి న్యాయపరమైన, గౌరవప్రదమైన నిష్క్రమణను అందించనున్నట్లు ట్రంప్ ఆఫీస్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ప్రోగ్రామ్ కింద రాజీనామా చేసేవారికి రోజువారీ పనిభారంతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందిచబడతాయని వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 30 వరకు వర్తించే అన్ని వ్యక్తిగత పని అవసరాల నుండి మినహాయించబడతారని స్పష్టం చేయబడింది.
ఎన్నికల సమయంలోనే ట్రంప్ సాంప్రదాయ పాలసీలను మారుస్తానని చేసిన వాగ్ధానానికి అనుగుణంగానే ప్రస్తుతం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో దాదాపు 3 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్న సంగతి తెలిసిందే. యూఎస్ శ్రామిక శక్తిలో ఇది అతిపెద్దదిగా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సగటు ఫెడరల్ ఉద్యోగి 11.8 సంవత్సరాలు పనిచేస్తారు. ప్రస్తుతం ట్రంప్ ఇచ్చే ఆఫర్ కింద ఎక్కువ మంది ఉద్యోగులు ముందుకు సాగితే అది అమెరికా వ్యాప్తంగా సేవల్లో తీవ్ర అంతరాయాలకు దారితీస్తుందని తెలుస్తోంది.
ట్రంప్ ఆఫర్ కింద ఉద్యోగుల రాజీనామాలు.. వెటరన్స్ అఫైర్స్ హెల్త్ వర్కర్లు, లోన్ ప్రాసెసర్స్, మిలిటరీ కాంట్రాక్టర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, నీటి నాణ్యతను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు, విమాన ప్రయాణం, ఉత్పత్తి భద్రతకు బాధ్యత వహించే ఉద్యోగులతో సహా అనేక కీలక పాత్రలను ప్రభావితం చేయవచ్చు. అయితే ట్రంప్ ప్రస్తుత ఆఫర్‌ను ఎవెరెట్ కెల్లీ, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రంప్ తాజా చర్యలు ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications