H-1B వీసా హోల్డర్లకు బిగ్ న్యూస్.. కీలక నిర్ణయం దిశగా అమెరికా అధ్యక్ష అడ్వైజరీ ప్యానెల్..

H-1B Visa: అమెరికాలో రోజురోజుకూ మారుతున్న పరిస్థితుల కారణంగా ఎక్కువ ఆందోళనకు గురవుతున్న వారిలో H-1B వీసా హోల్డర్లు ముందు వరుసలో ఉన్నారు. అయితే వీరి సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజాగా తెలుస్తోంది.

ఉపాధి పొందుతున్న విదేశీయులు..

ఉపాధి పొందుతున్న విదేశీయులు..

అమెరికా వెళ్లి సెటిల్ కావటం అనేది చాలా మందిలో ఉండే కల. ఈ కలల ప్రపంచంలో విహరించాలనుకునే భారతీయుల సంఖ్య ఏమీ తక్కువ కాదు. ఎందుకంటే అమెరికా వీసా సంపాధించటం ఎంత కష్టంతో కూడుకున్నదో మనలో చాలా మందికి తెలిసిందే. నెలల తరబడి వేచి తెచ్చుకున్న వీసాలు ఆర్థిక సంక్షోభం వల్ల జాబ్ కోల్పోతే ఎక్స్ పైరీ అవుతాయనే ఆందోళన చాలా మందిని నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తోంది. అయితే తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం స్థానిక కంపెనీలు ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులను నియమించుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నాయని వెల్లడైంది.

వీసా గడువు..

వీసా గడువు..

సాధారణంగా అమెరికాలో H-1B వీసాపై నివసించే వ్యక్తులు తమ ఉద్యోగాన్ని కోల్పోయిన పక్షంలో 60 రోజుల వరకు అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఈ గడువు లోగా వారు మరో ఉద్యోగాన్ని పొందాల్సి ఉంటుంది. లేకుంటే చట్ట ప్రకారం వీసా గడువు ముగుస్తుంది. వారు తిరిగి ఇండియాకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఆపిల్, ట్విట్టర్ వంటి టెక్ సంస్థలు భారీగా ఉద్యోగుల కోతలకు వెళ్లటంతో విదేశీ టెక్కీలకు జాబ్ సెక్యూరిటీ ఆందోళనలు పెరిగిపోయాయి. అర్థాంతరంగా దేశ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.

బిగ్ రిలీఫ్..

బిగ్ రిలీఫ్..

లేఆఫ్స్ కారణంగా ప్రభావితమైన వేలాది మంది H-1B కార్మికులకు రిలీఫ్ ఇచ్చేందుకు అమెరికా ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్‌కమిటీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న వీసా గ్రేస్ పిరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాలని ఫెడరల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన, ఆందోళనలో ఉన్న H-1B వీసా హోల్డర్‌లకు పెద్ద ఉపశమనాన్నిచ్చే అంశం. పైగా వారికి కొత్త ఉద్యోగం లేదా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కునేందుకు అదనపు సమయాన్ని అందిస్తుంది.

భారత్ నుంచి.

భారత్ నుంచి.

.

భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం 10,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు H-1B వీసాలపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం కుదిపేస్తున్న సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని నేపథ్యంలో చాలా అమెరికా కంపెనీలు తాత్కాలికంగా కొత్త నియామకాలను నిలిపివేయటం.. ఖర్చులను తగ్గించునేందుకు పొదుపు మంత్రాన్ని పాటించటం టెక్కీల యూఎస్ ఆశలపై నీళ్లు జల్లుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+