Disney Layoff: ఉద్యోగుల తొలగింపుల వేడి కేవలం టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ డిస్నీ సైతం ఉద్యోగుల కోతకు మెుగ్గు చూపంట పరిస్థితులను కళ్లకు కడుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెలస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు భారత దేశంలోనూ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. 2008 సంక్షోభం సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది అంటున్నారు.
ఒకటి తర్వాత మరొకరు..
తాజాగా అమెజాన్ ఉద్యోగుల తొలగింపును ప్రకటించగా.. అంతకు ముందు మెటా, ట్విట్టర్, గూగుల్, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ తో పాటు అనేక సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఉద్యోగుల విషయంలో కోతలు, తాత్కాలికంగా నియామకాల నిలిపివేత వంటి చర్యలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ.. రోజులు గడిచేకొద్దీ కంపెనీలు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నాయి. తప్పని పరిస్థితుల్లోనే ఇలా చేస్తున్నామని.. ఉద్యోగులు తమను నిజంగా క్షమించాలి సీఈవోలు చేతులు జోడించి అడుగుతున్నారు.

లీకైన మ్యాటర్..
ప్రొడక్షన్ అండ్ స్ట్రీమింగ్ కంపెనీ వాల్ట్ డిస్నీ సైతం సమీక్షల తర్వాత ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు మీడియా కథనాలు బటకు రావటం కల్లోలాన్ని సృష్టిస్తోంది. లీకైన అంతర్గత మెమోలో Diseny CEO బాబ్ చాపెక్ నిరుత్సాహకరమైన క్వార్టర్లీ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కొత్త నియామకాలను నిలిపేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం డిస్నీ కంపెనీలో దాదాపూ 1,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సీఈవో ఏమన్నారంటే..
టార్గెటెడ్ హైరింగ్ ఫ్రీజ్ ద్వారా ఉద్యోగుల సంఖ్య పెంపును పరిమితం చేస్తున్నట్లు సీఈవో బాబ్ చాపెక్ మెమోలో తెలిపారు. ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నందున కేవలం చాలా తక్కువ సంఖ్యలోనే పరిమితంగా నియామకాలు ఉంటాయని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ వెల్లడిస్తుందని అన్నారు. ప్రస్తుత తరుణంలో ఖర్చులను తగ్గించేందుకు కంపెనీ అన్ని పొదుపు మార్గాలను అన్వేషిస్తోందని.. అందులో భాగంగానే తొలగింపుల అంచనాలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

స్టాక్ ఢమాల్..
కంపెనీ తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేనందున ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై పడింది. కంపెనీ షేర్లు గత కొన్ని నెలలుగా క్షీణించాయి. ఈ క్రమంలో బుధవారం స్టాక్ ఏకంగా తన 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అందుకే రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని సీఈవో బాబ్ చాపెక్ మెమోలో పేర్కొన్నారు. అయితే దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.


Click it and Unblock the Notifications