Pakistan Crisis: పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక అంధకారంలోకి జారుకుంది. దీర్ఘకాలికంగా చెల్లింపుల బ్యాలెన్స్ సమస్యను ఎదుర్కొంటోంది. దీనంతటికీ కారణంగా దాయాది వల్ల సరిపడా ఫారెక్స్ నిల్వలు లేకపోవటమే కారణం. ఈ క్రమంలో పాక్ IMF ఆర్థిక సాయం కోసం చేతులు చాచింది. అది పెట్టిన షరతులకు సైతం తలొగ్గింది.

చైనా సాయం..
రోజురోజుకూ అప్పుల ఊబిలోకి జారుకుంటున్న పాకిస్థాన్ కు డ్రాగన్ దేశం సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 700 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ఆమోదించిందని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ బుధవారం ప్రకటించారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ సాయం కోసం పాక్ ఎదురుచూస్తోంది.

అమెరికా ఆందోళన..
చైనా అప్పుల వల వేయటాన్ని అమెరికా తప్పుపట్టింది. భారత్ పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ లకు చైనా ఇస్తున్న రుణాలు "బలవంతపు పరపతి" కోసం ఉపయోగించబడటం తీవ్ర ఆందోళనకరమైన అంశంగా అమెరికా భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి రానున్నారు. భారత్‌తో కూడిన ఈ ప్రాంతంలోని దేశాలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలని, బయటి భాగస్వాములెవరూ బలవంతం చేయకూడదని అమెరికా మాట్లాడుతోందని దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ చెప్పారు.

సైనికులకూ తిండి పెట్టలేక..
పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం సైన్యాన్ని దెబ్బతీస్తోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్‌లు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. కొంతమంది ఫీల్డ్ కమాండర్లు జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG) కార్యాలయానికి దీనిపై లేఖలు రాశారు. అన్ని ఆర్మీ మెస్‌లలోని సైనికులకు ఆహార సరఫరాలో కోత విధించాలని సూచించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. నిధులలో కోతల మధ్య సైన్యం సైనికులకు రోజుకు 'రెండుసార్లు సరిగ్గా' ఆహారం ఇవ్వలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఎస్ఎస్ నేత..
ప్రస్తుతం దాయాది పాక్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత కృష్ణ గోపాల్ కీలక కామెంట్స్ చేశారు. సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు భారత్ గోధుమలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ లో కేజీ గోధుమల ధర రూ.250కి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 70 ఏళ్ల కిందట వారు మనతోనే కలిగి ఉన్నారని.. 1948, 1961, 1971, కార్గిల్ యుద్ధాలు చేసినప్పటికీ ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఆహార సంక్షోభం సమయంలో సాయంగా గోధుమలు పంపాలని భారతీయులు భావిస్తున్నట్లు గోపాల్ కామెంట్ చేశారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications