ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీలు మంచి ఆదరణను పొందాయి. చాలా మంది ఇన్వెస్టర్లు దీనిలో లాభాలు పొందేందుకు ఇప్పటికే అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన FTX ఎక్స్ఛేంజీ చాలా పాపులర్ అయ్యింది. అయితే అది తాజాగా పతనం కావటంతో అనేక మంది ఇన్వెస్టర్ల సొమ్ము గల్లంతయింది. కంపెనీ దివాలా తీయటం వెనుక వాస్తవాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి.

బహామాస్‌లో అరెస్ట్..
'తదుపరి వారెన్ బఫెట్'గా పిలువబడే FTX వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ తక్కువ వ్యవధిలో పెట్టుబడి ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే FTX కుప్పకూలిన నేపథ్యంలో ప్రస్తుతం బహామాస్‌లో అతడు అరెస్టయ్యాడు.
గత నెలలో అతడు కంపెనీ దివాలా కోసం దాఖలు చేశాడు. దీనికి ముందు అతను స్థాపించిన క్రిప్టో ఎక్స్ఛేంజీ ప్రపంచంలో రెండవ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. US ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపిన తర్వాత సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్‌ను సోమవారం అరెస్టయ్యాడు.

సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్..
సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ 2017లో స్థాపించబడిన Alameda రీసెర్చ్‌తో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత ఖాతాకు FTX క్రిప్టో ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల కస్టమర్ నిధులను రహస్యంగా బదిలీ చేసినందున FTX ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని వెల్లడించాడు. అయితే అంతపెద్ద మెుత్తం కాకపోయినప్పటికీ కనీసం ఒక బిలియన్ డాలర్లైనా రహస్యంగా బదిలీ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అమెరికా చట్టాలు..
యునైటెడ్ స్టేట్స్ చట్టాలకు వ్యతిరేకంగా ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ అరెస్ట్ అయ్యాడు. సామ్ బ్యాంక్‌మాన్ చేసినది కామన్వెల్త్ ఆఫ్ బహామాస్ చట్టాలకు వ్యతిరేకంగా నేరమని యూఎస్ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. బహామాస్‌లోని అటార్నీ జనరల్ కార్యాలయం సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌పై ఆరోపణలు అధికారికంగా ధృవీకరించబడిన తర్వాత అరెస్టును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం నాసా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నట్లు నివేదికలు తెలిపాయి.

నవంబర్ లో దివాలా..
బహామస్ కేంద్రంగా 2019లో స్థాపించబడిన FTX గతనెల 11న దివాలా కోసం దాఖలు చేసింది. అయితే కంపెనీని రక్షించేందుకు మరో ఎక్స్ఛేంజీకి దీనిని విక్రయించాలని నిర్ణయించారు. కానీ డీల్ కుదరలేదు. ఈ కారణంగా సాధారణ ఇన్వెస్టర్లకు చెందిన దాదాపు 6 బిలియన్ డాలర్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.దీనిపై అమెరికా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటోంది.


Click it and Unblock the Notifications