Trump News: డాలర్ జోలికొస్తా అంతుచూస్తానన్న ట్రంప్.. బ్రిక్స్ దేశీలకు భారీ హెచ్చరిక..!!
Trump Warning BRICS: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి అనేక కీలకమైన నిర్ణయాలతో అమెరికాకు మేలు చేయాలని చూస్తున్నారు. ప్రపంచ దేశాలపై తిరిగి అమెరికా పెత్తనం స్టార్ట్ అవుతుందని దీనిని చూసిన నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలపై భారీగా సుంకాలు పెంచిన ట్రంప్ తాజాగా డాలర్‍ను గ్లోబల్ కరెన్సీగా కొనసాగటాన్ని అడ్డుపడుతున్న దేశాలకు కీలక వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
గత చరిత్రను పరిశీలిస్తే యూరోపియన్ దేశాల నుంచి అరబ్ దేశాల వరకు డాలర్ ఏకచత్రాధిపత్యానికి చెక్ పెట్టాలని చాలా మంది ఇప్పటికే ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్ డాలర్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నించే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని తాజాగా ట్రంప్ హెచ్చరించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా బ్రిక్స్ దేశాలకు దీనిపై ట్రంప్ బెదిరింపును జారీ చేశారు.

ప్రపంచ వాణిజ్యంలో యూఎస్ డాలర్‌కు ప్రధాన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కరెన్సీ. IMF ప్రకారం డాలర్ ప్రపంచ విదేశీ మారక నిల్వలలో 58 శాతం కలిగి ఉంది. వివిధ దేశాల మధ్య జరిగే వాణిజ్యం, చమురు చెల్లింపులకు డాలర్ కీలకమైన కరెన్సీగా ఉంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు డాలర్ ఆల్టరేన్ చెల్లింపు పరిష్కారాలను సృష్టిస్తూ తమ స్థానిక కరెన్సీల్లో చెల్లింపు సెటిల్మెంట్స్ చేసుకోవటం ట్రంపును ఆగ్రహానికి గురిచేస్తోంది. డీడాలరైజేషన్ ప్రణాళికలను అడ్డుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. కన్జమ్షన్ ఆధారిక ఎకానమీగా ఉన్న అమెరికా స్థిరంగా ముందుగా సాగటానికి ప్రపంచ వ్యాప్తంగా డాలర్ల సర్క్యులేషన్ చాలా కీలకమని తెలిసిందే. అమెరికా పెత్తనం కొనసాగటానికి డాలర్ బలం చాలా ముఖ్యమని గమనించిన ట్రంప్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు.
బ్రిక్స్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు యూఎస్ డాలర్‌పై US నియంత్రణను ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయని చెప్పారు. ఈ దేశాలు కొత్త కరెన్సీని సృష్టించకూడదని ప్రతిజ్ఞ చేయాలి లేదా యూఎస్ డాలర్ స్థానంలో ఏదైనా కరెన్సీకి మద్దతు ఇవ్వకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అలా చేయని దేశాలపై 100 శాతం పన్ను విధిస్తామని, దర్వారా అమెరికా మార్కెట్‌లో వ్యాపారం చేయటం కష్టతరంగా మారుతుందని అన్నారు. దీనికి ముందు అక్టోబరులో జరిగిన బ్రిక్స్ సదస్సులో అమెరికా డాలర్ ను ఆయుధంగా మార్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ప్రపంచ వ్యాపారంపై రష్యా దీంతో పెత్తనం చెలాయిస్తోందని దీనికి ప్రత్యామ్నాయాలను వెతకాలని వ్యాఖ్యానించిన తర్వాత ప్రస్తుతం ట్రంప్ హెచ్చరికలు వచ్చాయి.


Click it and Unblock the Notifications