అమెరికా మోర్టజ్ దిగ్గజం, ఫైనాన్స్ కంపెనీ ఫ్యానీ మే (Fannie Mae) దాదాపు 200 మంది ఉద్యోగులను "నైతిక ప్రాతిపదికన" (ethical grounds) కింద తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి, అయితే వీరిలో ఎక్కువ మంది తెలుగువారే ఉండటం గమనార్హం. ఈ నెల జనవరిలో ఆపిల్ సంస్థ కుపెర్టినో హెడ్ ఆఫీస్'లో కూడా దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించింది, ఇందులో కూడా కొంతమంది భారతీయు ఉన్నారు. ఫ్యానీ మేలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈ తొలగింపులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇంకా అనేక అక్రమాలకు పాల్పడినందుకు ఈ తొలగింపులు చేసినట్లు వివరించింది. మరో విషయం ఏంటంటే ఫ్యానీ మే సంస్థ అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది.

ఫెన్నీ మే అని పిలువబడే ఫెడరల్ నేషనల్ మార్ట్‌గేజ్ అసోసియేషన్‌లో 200 మంది భారతీయ-అమెరికన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమాచారం ప్రకారం, సంస్థలోని కొంతమంది తెలుగు వారు కలిసి నకిలీ ధార్మిక సంస్థలను ఏర్పాటు చేశారని, ఈ స్వచ్ఛంద సంస్థలకి వారి నుంచి కంపెనీ నుండి ఆర్థిక సహాయం పొందారని, ఆ తర్వాత వారు ఆ ఆర్థిక సహాయాన్ని సొంత స్వార్థానికి ఉపయోగించుకున్నారని తెలిపింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA)తో కుమ్మక్కై కంపెనీలను మోసం చేసి నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు చాల మంది తెలుగు ఉద్యోగులపై ఉన్నాయి. అయితే ఈ అవకతవకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం కూడా దర్యాప్తులో ఇరుక్కుపోయింది.
తొలగింపుకు గురైనా తెలుగు ఉద్యోగులలో ఒకరు తానాలో ప్రాంతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారని, మరొకరు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మాజీ అధ్యక్షుడి భార్య అని చెబుతున్నారు. ఇందులో తానా ఒక్కటే సంస్థ కాదని, ఇతర తెలుగు సంఘాలు కూడా దర్యాప్తులో ఉన్నాయని వార్తలు వచ్చాయి.
మరోవైపు ఆపిల్‌లో జరిగిన కుంభకోణం ఈ ఘటనని హై లెట్ చేస్తుంది. ఆపిల్ సంస్థ కూడా భారీగా తెలుగు ఉద్యోగులను (ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ) తొలగించింది. ఆపిల్ బే ఏరియా ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాలని ఆదేశించింది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రాంలో అక్రమాలకు పాల్పడిన కారణంగా తెలుగు వారిని ఉద్యోగాల నుండి తొలగించారు. వీరిలో చాలామంది సీనియర్ మేనేజర్లు ఉండటం గమనార్హం.
ఆపిల్ కేసులో డిసెంబర్ 2024లో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు TANAకు సమన్లు జారీ చేసింది. 2019 నుండి 2024 వరకు వచ్చిన విరాళాలు, ఖర్చు చేసిన మొత్తాల రికార్డులు అలాగే సంస్థాగత ప్రతినిధుల వివరాలపై సమన్లు డిమాండ్ చేశాయి.
More From GoodReturns

Layoffs: ఏఐ మీ ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా లేక మిమ్మల్ని బాస్‌ను చేస్తుందా?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications