Super Offer: ఎక్కడైనా ఆఫీసువేళల్లో పనిచేస్తూ నిద్రపోతే బాస్ తిట్టడం లేదా జీతం కట్ చేయటం లాంటివి చేయటం మామూలేనని మనందరికీ తెలిసిందే. అందుకే ఆఫీసులో నిద్ర వచ్చినా.. చాలా మంది నిద్రను అదుపులో పెట్టుకోవటం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ అమెరికాలోని ఒక కంపెనీలో మ్యాటర్ వేరే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.

Mattress కంపెనీ..
కాస్పర్ సంస్థ అమెరికాకు చెందిన ఒక mattress తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది బాగా నిద్రపోయే ఉద్యోగుల కోసం వెతుకుతోంది. ఈ విషయం వినటానికి వింతగా ఉన్నప్పటికీ నిద్రపోతూ సంపాదించటం అనే ఆలోచన ఎంత బాగుటుందో కథ. అయితే తమ స్టోర్లలో తయారు చేసే పరుపులపై పడుకుంటే నిద్ర ఎలా వస్తుందో తెలుసుకునేందుకు స్లీపర్‌ని నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

నిద్రించడానికి డబ్బు..
ప్రాజెక్ట్‌లో పాల్గొనేవారు తప్పనిసరిగా ప్రొఫెషనల్ స్లీపర్లు అయి ఉండాలి. వారు తమ ప్రోడక్ట్ మ్యాట్రెస్‌లపై ఎలా నిద్రపోతారు, పరుపుపై పడుకోవడం వల్ల వారు ఎలాంటి విలాసవంతమైన అనుభవాలను పొందుతారనే దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం వారికి భారీ వేతాన్ని సైతం చెల్లించేందుకు క్యాస్పర్ ఆఫర్ చేసింది.

టిక్ టాక్ వీడియో..
తమ కంపెనీ మంచి స్లీపర్‌ల కోసం వెతుకుతుందని, దీని కోసం మంచి స్లీపర్‌లు టిక్‌టాక్ వీడియో ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. చాలా మంది ఔత్సాహికులు దీనిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఉచితాలు కూడా..
తమ కంపెనీ స్లీపింగ్ జాబ్స్‌కు వచ్చే వారు పైజామా వంటి నైట్ దుస్తులను ధరించడానికి అనుమతిస్తామని, నిద్రిస్తున్న ఉద్యోగులకు ఇవన్నీ ఉచితంగా తామే అందజేస్తామని కంపెనీ తెలిపింది. ఎంపికైన వారికి నిద్రవేళల షెడ్యూల్ ఇవ్వబడుతుందని కాస్పర్ కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

చివరి తేదీ ఎప్పుడంటే..
ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పంపడానికి చివరి తేదీ ఆగస్టు 11, 2022 అని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చాలా మంది ఈ ఉద్యోగానికి పోటీ పడి దరఖాస్తులు చేసుకుంటున్నట్లు సమాచారం.

కలలు కనే ఉద్యోగం..
మంచి ఉద్యోగం పొందటం అనేది మనలో చాలా మందికి ఒక పెద్ద కల. ప్రపంచంలో చాలా మంది యువత కలలను నెరవేర్చుకోవటానికి నిద్రాహారాలు మాని శ్రమిస్తుంటారు. అయితే ఈ ఉద్యోగం పొందిన వారికి అలాంటి కష్టాలు అస్సలు ఉండవు. హాయిగా నిద్రపోతూ కలలు కంటున్నందుకు గాను కంపెనీ వారికి జీతాన్ని అందిస్తోంది. ఈ కంపెనీ జాబ్ ఆఫర్ ను చూసిన చాలా మంది ఔనా అంటూ ఆశ్చర్యానికి గురవుతుండగా, మరి కొందరు మాత్రం బలే ఆఫర్ అని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications