Stock Market: వచ్చే వారం మార్కెట్ల పరిస్థితి ఏమిటి..? ఇన్వెస్టర్స్ ఇవి తెలుసుకోండి..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం ప్రయాణాన్ని పాజిటివ్ గా ముగించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ మంచి పనితీరును కనబరిచాయి.
ఫెడ్ ప్రకటనతో అమెరికా మర్కెట్లు స్థిరమైన వృద్ధిలోకి రావటంతో ఆసియా మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు శుక్రవారం లాభాలతో కళకళలాడాయి. దీంతో కీలక సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఇదే క్రమంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగించాయి.

రానున్న వారంలో నిఫ్టీ సూచీ మరోసారి జీవితకాల గరిష్ఠమైన 18800 స్థాయిలను చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 18,736; 18,646; 18,582 పాయింట్ల వద్ద సపోర్ట్ ఉంటుందని బ్రోకరేజ్ ఎంకే గ్రోబల్ పేర్కొంది. ఇదే క్రమంలో 18,890; 18,955 రెసిస్టెంట్ స్థాయిలుగా వ్యవహరిస్తాయని అంచనా వేశారు. స్వల్పకాలికంలో 18600 వద్ద తక్షణ మద్దతుతో ప్రస్తుత మొమెంటం కొనసాగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఈ స్థాయికి కింద కొంత బలహీనత ఉండవచ్చని పేర్కొంది.
వచ్చేవారం ప్రధానంగా అమెరికా మార్కెట్ల పనితీరు దేశీయ మార్కెట్లకు కీలకమని తెలుస్తోంది. మార్కెట్ల పనితీరుపై దీని పాత్ర ఉంటుంది. సుదీర్ఘ కన్సాలిడేషన్ దశను బ్రేక్‌అవుట్‌తో ముగించిన తర్వాత.. అమెరికా బెంచ్‌మార్క్ ఇండెక్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ (DJIA), టెక్-హెవీ నాస్‌డాక్ ఇప్పటికే పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. ఇది భారత మార్కెట్లకు సానుకూల అంశమని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ SVP టెక్నికల్ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఒకవేళ మార్కెట్లు క్షీణిస్తే డిప్స్ వద్ద కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గు చూపొచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications