కృత్రిమ మేధస్సులో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా సెనేటర్ జోష్ హాలే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే డీప్‌సీక్ వంటి చైనా అభివృద్ధి చేసిన AI మోడళ్లను డౌన్‌లోడ్ చేసుకునే వ్యక్తులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, $1 మిలియన్ జరిమానా లేదా రెండూ జరిమానాలు విధించబడతాయి. అమెరికా, చైనా దేశాలు AI ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న తరుణంలో ఈ చర్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సూచిస్తుంది.
విషయం ఏంటంటే అమెరికా అండ్ చైనా మధ్య AI టెక్నాలజీ దిగుమతి, ఎగుమతిని అరికట్టడానికి అలాగే దానిని ఉల్లంఘించే వారికి కఠినమైన శిక్షలతో సహా డీకప్లింగ్ అమెరికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాబిలిటీస్ ఫ్రమ్ చైనా యాక్ట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు .గత వారం దాఖలు చేసిన ఈ బిల్లు చైనా AI మోడల్స్ ని అమెరికన్లు వాడకుండా నిషేధం చేస్తుంది. ఇందులో AI స్టార్ డీప్‌సీక్ కూడా ఉంది. హార్వర్డ్ AI పరిశోధకుడు బెన్ బ్రూక్స్ ఈ చర్యని ఇప్పటివరకు AI పై అత్యంత చట్టపరమైన చర్యగా నిలుస్తుందని అన్నట్లు ఒక నివేదిక పెరిగింది.

అమెరికా సెనేటర్ ఎం చెబుతుంది ?
"చైనీస్ AIలోకి వెళ్లే ప్రతి డాలర్ అండ్ గిగ్ డేటా చివరికి అమెరికాకు వ్యతిరేకంగా ఉపయోగించే డాలర్లు & డేటా. అమెరికా మన స్వంత బలాన్ని పణంగా పెట్టి మన అతిపెద్ద ప్రత్యర్థిని శక్తివంతం చేయదు" అని జోష్ హాలీ ఒక ప్రకటనలో తెలిపారు. డీప్‌సీక్ డేటా-హార్వెస్టింగ్, తక్కువ-ధర AI మోడల్, ఇది అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది అలాగే అమెరికన్ టెక్నాలజీ స్టాక్‌ల పతనానికి గురిచేసింది" అని కూడా అభివర్ణించారు.
బిల్లు ఆమోదం పొందుతుందా?
జోష్ హాలీ బిల్లు ప్రస్తుతం ఆమోదం పొందకపోవచ్చు, కానీ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల రాబోయే నెలల్లో మరిన్ని AI ఆంక్షలను ముందుకు తీసుకురావచ్చని సూచిస్తుంది. డీప్‌సీక్ అధికారికంగా నిషేధించబడుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా AIలో చైనా చర్చ ఇంకా ముగియలేదు. జోష్ హాలీ బిల్లు అమెరికన్ కంపెనీలు చైనాలో AI పై పరిశోధన చేయకుండా లేదా చైనీస్ సంస్థలతో సహకరించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తుంది. దింతో అమెరికన్ కంపెనీలు చైనీస్ AI అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications