Accenture Jobs: ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల జోరు కొనసాగుతోంది. పైగా కంపెనీలకు ప్రాజెక్టులకు తగినట్లుగా ఉద్యోగులు అందుబాటులో లేకపోవటంతో కొత్త రిక్రూట్ మెంట్లు చేసుకుంటున్నాయి. దీనిలో అనేత కంపెనీలు టైర్- 2,3 నగరాల్లో సైతం తమ ఆఫీసులను తెరుస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఇటీవల కోయంబత్తూరులో తన కొత్త అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ శాఖ కోసం కంపెనీ ఉద్యోగుల నియామకాన్ని ప్రారంభించింది. తగిన అర్హత కలిగిన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?
కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులో తన కొత్త శాఖను ప్రారంభించింది. వివిధ దేశాలకు చెందిన కస్టమర్లకు ఇక్కడి నుంచే సేవలందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆసక్తి ఉన్న ఐటీ ఉద్యోగులు లేదా ఔత్సాహికులు https://www.accenture.com/in వెబ్ సైట్ లోని Careers విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీ దిగ్గజం వెల్లడించింది.

అక్కడే ఎందుకంటే..
తాము టైర్- 2 నగరాల్లో తమ ఉనికిని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాము. కోయంబత్తూరు భారతదేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థలకు నిలయంగా ఉంది. అందువల్ల తాము ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు AITC యాక్సెంచర్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ జురెల్ తెలిపారు.

ఈ టెక్నాలజీలపై దృష్టి..
దేశంలో వ్యాపార విస్తరణను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం సమర్థులైన ఉద్యోగులను నియమించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కంపెనీ క్లౌడ్, డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్, ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.

సాంకేతిక కేంద్రాలు ఎక్కడెక్కడంటే..
కోయంబత్తూర్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్, కోల్‌కతా, ముంబై, పూణేలలో యాక్సెంచర్ అధునాతన సాంకేతిక కేంద్రాలను కలిగి ఉంది. యూఎస్ ప్రధాన కార్యాలయంగా ఉన్న యాక్సెంచర్.. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలను అందించే కంపెనీల్లో ఒకటి. కంపెనీ కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది.

మంచి అవకాశం..
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కొనసాగుతున్న తరుణంలో రిక్రూట్‌మెంట్ కోతలు, తొలగింపులు జరుగుతుండగా Accenture వేగంగా విస్తరణను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ తన నూతన కేంద్రాన్ని ప్రారంభించటం వల్ల IT ఉద్యోగ ఆశావహులకు మంచి అవకాశమని చెప్పుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications