Cognizant: టెక్కీలకు గుడ్ న్యూస్.. కాగ్నిజెంట్ జీతాల పెంపు నిర్ణయం.. ఎంతంటే..
Salary Hike: పండగ పూట కూడా పాత శాలరీనేనా అంటూ చాలా మంది ఆశగా కంపెనీ యాజమాన్యాల వైపు చూస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఐటీ దిగ్గజ కంపెనీ తన ఉద్యోగులకు మంచి శాలరీ హైక్స్ ప్రకటించేందుకు సిద్ధమౌతోంది. అయితే ఇప్పటి వరకు దేశీయ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మాత్రమే తమ ఉద్యోగులకు జీతాల పెంపు విషయంలో ప్రకటనలు చేశాయి.

కాగ్నిజెంట్..
పండుగ సీజన్లో అమెరికన్ మల్టీనేషనల్ టెక్ కంపెనీ తన ఉద్యోగులకు తియ్యటి కబురు మోసుకొస్తోంది. ఈ సారి యావరేజ్ గా 10 శాతం వరకు జీతాలను పెంచాలని కంపెనీ యోచిస్తున్నట్లు అంతర్గతంగా విషయంపై అవగాహన ఉన్నవారు వెల్లడించారు. పెంపు ఎంత ఉంటుందనే విషయాలు మెయిల్ ద్వారా తెలియజేస్తామని కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. ఇది నిజంగా సంక్షోభంలోనూ సంతోషాన్ని కలిగించే వార్తనే చెప్పుకోవాలి.

మార్జిన్ల దెబ్బతో..
మార్జిన్లు తీవ్రంగా దెబ్బతిన్నవేళ.. దిగ్గజ ఐటీ కంపెనీలు కొత్త మార్కెట్లలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నందున కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తోందని సీఈవో సలీల్ పరేఖ్ చెప్పటం గమనార్హం. ఇతర దేశీయ కంపెనీలు సైతం మరిన్ని దేశాలకు పనిచేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

టెక్ మహీంద్రా..
ఇదే సమయంలో టెక్ మహీంద్రా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదు సంవత్సరాల్లో 3,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. గుజరాత్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఐటీ పాలసీలో భాగంగా ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది.


Click it and Unblock the Notifications