ఇరాన్ యుద్ధంపై ట్రంప్ చివరి నిర్ణయం.. పూర్తి స్థాయిలో యుద్ధానికి రెడీ కావాలని సైన్యానికి ఆదేశాలు..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో పురోగతి లభించకపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో, దౌత్య ప్రయత్నాలు పూర్తిగా విఫలమైతే ఇరాన్‌పై సరికొత్తగా భారీ సైనిక దాడులు ప్రారంభించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఉన్నతస్థాయి అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఆక్సియోస్' (Axios) ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రాంతీయ దేశాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చర్చల ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగుతోంది. ఈ తాత్సారంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఒక చివరి, నిర్ణయాత్మకమైన భారీ సైనిక చర్యను చేపట్టి, ఆ తర్వాత తాము విజయం సాధించినట్లు ప్రకటించి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ ఈ వారాంతంలో తన కుమారుడి వివాహ వేడుకకు కూడా వెళ్లకుండా, దేశ ప్రయోజనాల దృష్ట్యా వైట్ హౌస్‌లోనే ఉండాలని నిర్ణయించుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

US-Iran war Trump on Iran conflict US Iran tensions Donald Trump Iran statement US military strikes Iran war latest news Middle East conflict US attack on Iran Pentagon strike plans Iran crisis update Trump war comments US Iran relations breaking world news Iran military tensions America Iran war fresh US strikes geopolitical tensions global conflict news Iran attack update Middle East war news

ఇరాన్ వివాదంలో తదుపరి వ్యూహాలను సిద్ధం చేయడానికి.. ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక అత్యవసర, ఉన్నత స్థాయి జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ సూసీ వైల్స్ వంటి అగ్రశ్రేణి సైనిక, దౌత్య నిపుణులు పాల్గొన్నారు.చర్చలు గనుక పూర్తిగా విఫలమైతే అమెరికా సైన్యం సిద్ధం చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికలు (Alternative Plans), సైనిక చర్యల వల్ల తలెత్తే పరిణామాలు, ముడిచమురు రవాణా మార్గాలపై పడే ప్రభావం గురించి భద్రతా అధికారులు అధ్యక్షుడికి సుదీర్ఘంగా వివరించారు.

Also Read

మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఈ చర్చలపై స్పందించింది. అమెరికాతో ఉన్న విభేదాలు చాలా లోతైనవని, కేవలం కొన్ని వారాల చర్చలతో ఇవి పరిష్కారం కావని స్పష్టం చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గంలో స్వేచ్ఛా రవాణా, తమ అణు కార్యక్రమాలపై అమెరికా పెడుతున్న ఆంక్షల వంటి అనేక అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని Iran పేర్కొంది.

ఒకవేళ అమెరికా దాడులకు దిగితే తాము కూడా దీటుగా బదులిస్తామని ఇరాన్ అనుబంధ శక్తులు హెచ్చరిస్తున్నాయి. దౌత్య చర్చలు ఒకవైపు సాగుతున్నా, అమెరికా రక్షణ విభాగం సెలవులను సైతం రద్దు చేసుకుని దాడులకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందుకోవడం చూస్తుంటే, పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగసిపడే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రస్తుతానికి ఐక్యరాజ్యసమితితో పాటు పలు అరబ్ దేశాలు రంగంలోకి దిగి ఇరు పక్షాల మధ్య శాంతిని నెలకొల్పడానికి, పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు, ప్రతిదాడుల వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో అనే భయం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+