SVB Crisis: మరిన్ని బ్యాంకులు కుప్పకూలతాయ్.. హెచ్చరించిన ప్రముఖ ఇన్వెస్టర్..
SVB Crisis: అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకు మాత్రమే పరిమితమవుతుందా.. లేక మరిన్ని బ్యాంకులు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందా అని చాలా మందిలో ఆందోళనలు నెలకొన్నాయి.
బెయిలౌట్ కోరిన బ్యాంక్..
మార్చి 10న అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడటం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక రెగ్యులేటరీ సంస్థలు రంగంలోకి దిగి ఉద్యోగులు వెళ్లిపోకుండా చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బ్యాంక్ అమెరికా ప్రభుత్వం నుంచి బెయిలౌట్ ప్యాకేజీని కోరింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేందుకు.. US అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ మరిన్ని బ్యాంకులు విఫలమయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టర్ అభిప్రాయపడ్డారు.

బిల్ అక్‌మాన్ హెచ్చరిక..
ప్రముఖ ఇన్వెస్టర్ అక్‌మాన్ ఇంతకు ముందు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంపై దృష్టి సారించారు. ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి బ్యాంక్ డిపాజిటర్లందరినీ రక్షించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై ట్వీట్ చేస్తూ.. ఇది బెయిలౌట్ కాదని, 2008 సంక్షోభం సమయంలో పన్ను చెల్లింపుదారుల డబ్బును బ్యాంక్ షేర్లలో అమెరికా ప్రభుత్వం ఇంజెక్ట్ చేసిందని అన్నారు. బాండ్ హోల్డర్లు రక్షించబడినప్పటికీ.. టాక్స్ పేయర్స్ డబ్బు చాలా ప్రమాదంలో పడిందని అన్నారు.

మరిన్ని బ్యాంకుల ఫెయిల్..
అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ రానున్న కాలంలో మరిన్ని బ్యాంకులు ఇదే తరహాలో విఫలమయ్యే ప్రమాదం ఉందని బిల్ హెచ్చరించారు. కానీ ప్రభుత్వం వాటిని ఎలా నిర్వహిస్తుందనే దానిపై మాకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందని అన్నారు. ఈ ఘటన ద్వారా బ్యాంక్ బోర్డులు, మేనేజ్‌మెంట్‌లకు భారీ మేల్కొలుపు కాల్ వచ్చిందని ఆయన అన్నారు. కుప్పకూలిన బ్యాంక్ కు సీఈవోగా లేదా డైరెక్టర్ గా ఉండటం అంత సులువు కాదని పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ CEO బిల్ అక్‌మాన్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications