Warren Buffett: అమెరికా ఫేమస్ ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాజాగా మరోసారి 4.64 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే స్టాక్‌ను ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించారు.
2006 నుంచి ఇప్పటి వరకు సామాజిక కార్యక్రమాల కోసం తన సంపదలో మెుత్తం 51 బిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. 92 ఏళ్ల వయస్సులో వారెన్ బఫెట్ అతిపెద్ద వార్షిక విరాళాన్ని బుధవారం అందించారు. వీటిలో బెర్క్‌షైర్‌కి చెందిన క్లాస్ B షేర్లలో దాదాపు 13.7 మిలియన్లను కలిగి ఉంది.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు చెందిన బఫ్ఫెట్ బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 10.45 మిలియన్ షేర్లను విరాళంగా ఇస్తున్నారు. ఈ ఫౌండేషన్ ఇప్పటి వరకు మెుత్తంగా 39 బిలియన్ డాలర్లు విలువైన బెర్క్‌షైర్ స్టాక్‌ను పొందింది. అలాగే దివంగత భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్‌కు 1.05 మిలియన్ షేర్లను, పిల్లలు హోవార్డ్, సుసాన్ పేర్లపై ఉన్న స్వచ్చంద సంస్థలకు 2.2 మిలియన్ షేర్ల చొప్పున విరాళంగా ఇచ్చారు.
ప్రస్తుతం తొంభై ఏళ్లు పైబడిన బఫెట్ తన వయస్సు పెరుగుతున్న కొద్ది తాను జీవితకాలంలో సంపాదించిన సంపదను ఛారిటీకి అందిస్తున్నారు. ఆయన సంపద మెుత్తాన్ని 1965 నుంచి నిర్వహిస్తున్న బర్క్ షైర్ నుంచే ఆర్జించారు. ఇది ప్రధానంగా స్టాక్ మార్కెట్లలోని కంపెనీల్లో వాటాలను కొంటూ పెట్టుబడి పెడుతుంటుంది.
ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తో పాటు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా గివింగ్ ప్లెడ్జ్‌కు మార్గదర్శకత్వం వహించారు. ఇందులో మైఖేల్ బ్లూమ్‌బెర్గ్, లారీ ఎలిసన్, కార్ల్ ఇకాన్, ఎలోన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి 240 మందికి పైగా వ్యక్తులు తమ సంపదలో కనీసం సగం దాతృత్వానికి అంకితం చేశారు.


Click it and Unblock the Notifications