Gold Rate: గోల్డ్ పై గోల్డ్‌మన్ శాక్స్ కీలక నివేదిక.. షాపింగ్-ఇన్వెస్ట్మెంట్ చేసేవారికే..
Goldman Sachs on Gold: భారతదేశంలో ఎల్లప్పుడూ పసిడికి డిమాండ్ తగ్గదు. దీనికి తోడు ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్లు, పండుగల కారణంగా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ రిటైల్ మార్కెట్లలో కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు ధరలు నిరంతరం పెరుగుతున్న వేళ చాలా మంది పెట్టుబడి పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే భవిష్యత్తు ధరలపై నిపుణుల అభిప్రాయాలను దీనికి ముందు గమనించటం ముఖ్యం.
ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ పసిడి ధరలపై తన అంచనాలను పంచుకుంది. 2026 నాటికి 24 క్యారెట్ల పసిడి ధర ఔన్సు రేటు 3000 డాలర్ల మార్కుకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అయితే దీని వెనుక కారణాలను పరిశీలిస్తే ముందుగా ఫెడ్ వడ్డీ రేట్లను నెమ్మదిగా తగ్గించటం ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యల్లో భాగంగా రావటం కూడా గోల్డ్ రేట్లను పెంచవచ్చని తన నివేదికలో పేర్కొంది.

ఉదయం 11.08 గంటల సమయంలో ఎంసీఎక్స్ ధర 24 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.76,670 వద్ద కొనసాగుతోంది. గత ఏడాది పసిడి ధరలు దాదాపు 27 శాతం పెరుగుదలను చూసిన సంగతి తెలిసిందే. దీనికి ఒక ప్రధాన కారణం గోల్డ్ రేట్లను పెంచింది సెంట్రల్ బ్యాంకులు నిరంతయారంగా కొనుగోళ్లను చేపట్టడం ఈ పెరుగుదలకు కారణంగా నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం ఇది రానున్న కాలంలోనూ కొనసాగుతుందని తెలుస్తోంది. 2026 మధ్యకాలానికి నెలకు సగటున సెంట్రల్ బ్యాంకులు 38 టన్నుల చొప్పున తమ కొనుగోళ్లను చేపట్టవచ్చని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2025 చివరి నాటికి పసిడి ధరలు ఔన్సుకు 2910 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో 2025లో పెరిగే ధరల నుంచి రాబడిని అందుకోవటానికి పసిడి పై డిజిటల్ లేదా ఫిజికల్ మార్గాల్లో పెట్టుబడులను అన్వేషించటం ఉత్తమంగా నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా వివిధ పరిస్థితులు కూడా ప్రస్తుత పెరుగుదలకు కారకాలుగా ఉన్నాయి.
వరుసగా మూడు రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుదలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7215గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7871 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications