Tariffs on China: అమెరికాలో అధ్యక్ష మార్పుల ప్రభావం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనిపించటం స్టార్ట్ అయ్యింది. డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రధానంగా ఇటీవల ట్రంప్ తాను పవర్స్ చేపట్టిన తర్వాత కొన్ని దేశాలపై భారీగా టారిఫ్స్ ఉంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా చైనా నుంచి దిగుమతి చేసుకునే సోలార్ వేఫర్లు, కొన్ని టంగ్ స్టిన్ ఉత్పత్తులు, పాలీసిలికాన్ పై అమెరికా భారీగా టారిఫ్ రేట్లను పెంచింది. 2025 ప్రారంభం నుంచి వీటిని 25-50 శాతం పెంచుతున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ నిన్న ప్రకటించారు. తాజాగా ప్రకటించిన సుంకాల పెంపుదల పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చేపడుతున్న హానికరమైన విధానాలు, పద్ధతులను మరింత మట్టుపెట్టడానికి దోహదపడుతుందని అమెరికా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యలు క్లీన్ ఎనర్జీ ఎకానమీని ప్రోత్సహించడానికి జో బైడెన్-హారిస్ అడ్మినిస్ట్రేషన్ కింద చేసిన దేశీయ పెట్టుబడులను పూర్తి చేస్తాయని అంబాసిడర్ కేథరీన్ తాయ్ పేర్కొన్నారు.

టెక్నాలజీ బదిలీ, మేధో సంపత్తికి సంబంధించిన చైనా విధానాలపై సెక్షన్-301 కింద చట్టబద్ధమైన నాలుగేళ్ల సమీక్ష తర్వాత సుంకాల పెంపు ప్రకటించబడింది. ఈ క్రమంలో చైనా సైబర్ దొంగతనం, పారిశ్రామిక గూఢచర్యం వంటి హానికరమైన బలవంతపు సాంకేతిక బదిలీ పద్ధతులు కొనసాగిస్తున్నట్లు కనుగొన్నట్లు పేర్కొంది. చైనా నుంచి సోలార్ ఎగుమతులపై దిగుమతి సుంకాలు విధించినందున ఇతర దేశాల్లో ఉత్పత్తిని ప్రభావితం చేయడానికి బీజింగ్ ఓవర్ కెపాసిటీని అనుసరిస్తోందని అమెరికా ఆరోపించింది. ఇక్కడ ట్రంప్ అధికార పగ్గాలు జనవరిలో 20న చేపట్టడానికి మునుపే చైనాకు గట్టి దెబ్బ తగిలింది. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింతగా పరిస్థితులు దిగజారవచ్చని తెలుస్తోంది. పైగా ట్రంప్ ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీకి తన వ్యతిరేకతను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా నుంచి అమెరికాలోకి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తానని హామీ ఇచ్చారు. అక్రమ వలసలు, అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం అరికట్టాలని ట్రంప్ చూస్తున్నారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జనవరి 20న వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టనున్న వేళ.. చైనా, మెక్సికో, కెనడాపై సుంకాలను విధించే ప్రణాళికలతో పాటు తయారీ రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా ఉద్యోగాలను తిరిగి తీసుకురావడానికి అతని పరిపాలన సుంకాలను ఉపయోగించడం కొనసాగిస్తుందని సూచిస్తుంది. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. ట్రంప్ ప్రారంభ టారిఫ్ ప్లాన్‌లలో భారతదేశం పేరు కనిపించలేదు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనాపై అదనంగా 10 శాతం ఉంటాయని తెలుస్తోంది.
More From GoodReturns

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications