Billionaire: బిలియనీర్లుగా మారిన తర్వాత వ్యాపారవేత్తలు ఎలా మారతారో మనందరికీ తెలిసిందే. చాలా మంది కొంతైనా ఛారిటీలకు, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ఇస్తుంటారు. తాజాగా ఒక సంపన్నుడు తీసుకున్న షాకింగ్ నిర్ణయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా సంపన్నుడు..
యూఎస్ లోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చైన్ Hobby Lobby వ్యవస్థాపకుడు డేవిడ్ గ్రీన్ సంపదను శాపంగా పేర్కొన్నారు. దీంతో తన కంపెనీని వదులుకుంటున్నట్లు ఆయన ప్రకటించటం గమనార్హం.

ఎందుకీ నిర్ణయం..
తాను దేవుడిని ఎంచుకున్నాను కాబట్టే.. ఈ నిర్ణయం తీసుకున్నానని గ్రీన్ చెప్పారు. తన విశ్వాసమే తన విజయానికి నిజమైన మూలమని వెల్లడించాడు. యజమానిగా కంపెనీ విషయంలో హక్కులు, బాధ్యతలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

సంపద శాపం..
అయితే సంపద ఒక శాపమని ఈ బిలియనీర్ అభిప్రాయపడ్డాడు. చాలా సందర్భాల్లో ఈ విషయంపై కింది స్థాయికి వెళ్లినట్లయితే.. పిల్లలు, వివాహం వంటి విషయాల్లో సంపద నిజంగా పెద్ద శాపం అని అన్నారు. తన కంపెనీని విడిచి పెట్టడంపై స్పందించిన ఆయన తాను కేవలం నిర్వాహకుడినేనని.. తన వ్యాపారానికి దేవుడే నిజమైన యజమానని తెలుసుకున్న ఫలితమేనని చెప్పారు.

జీతాలు పెంపు..
ఈ కారణంగా హాబీ లాబీ తన ఉద్యోగులకు కనీస వేతనాన్ని గంటకు 18.50 డాలర్లకు పెంచింది. పైగా ప్రతి ఆదివారం స్టోర్ మూసివేస్తామని.. రోజువిడిచి రోజు రాత్రి 8 గంటలకు తమ షాపులను క్లోజ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. సుమారు 14 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార వాటాలను పూర్తిగా ట్రస్ట్‌కు ట్రాన్స్ ఫర్ చేయనున్నట్లు బిలియనీర్ గ్రీన్ తెలిపారు.

ఇదే విధంగా..
ఇదే తరహాలో పటాగోనియా వ్యవస్థాపకుడు వైవోన్ చౌనార్డ్.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు గాను తన కంపెనీని ఇచ్చేశాడు. చాలా ఏళ్ల కిందట ఎవాంజెలికల్ క్రిస్టియన్ అండ్ స్టీల్-ఎరెక్టింగ్ సంస్థ బార్న్‌హార్ట్ క్రేన్ & రిగ్గింగ్ మాజీ CEO అలాన్ బర్నార్డ్ కూడా 250 మిలియన్ డాలర్ల సంపదను ఛారిటీకి ఇచ్చారు.


Click it and Unblock the Notifications