మరో సంచలన రిపోర్ట్ బయట పెట్టనున్న Hindenburg Research.. ఈసారి ఎవరిమీదంటే..??
Hindenburg Research: భారత వ్యాపారదిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలపై సంచలన రిపోర్టు జనవరిలో విడుదల చేసిన తర్వాత ఆ సంస్థ దాదాపు 150 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. దీని నుంచి తేరుకునేందుకు అదానీ గ్రూప్ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అమెరికా షార్ట్ సెల్లర్ మరో సంచలన ట్వీట్ చేయటం ప్రపంచ మార్కెట్లలో వణుకు పుట్టిస్తోంది.
హిండెన్‌బర్గ్ సంస్థను నేట్ ఆండర్సన్ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ ఒక హెడ్జ్ ఫండ్ కాదు. పైగా సొంత మూలధనంతో పనిచేసే ఫోరెన్సిక్ రీసెర్చ్ అవుట్‌ఫిట్‌గా పిలవబడటానికి ఇష్టపడుతుంటుంది. ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్టుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు కుప్పకూలాయి. అయితే 2023లో భారతదేశానికి చెందిన వ్యాపార సమ్మేళం అదానీ గ్రూప్ పై సంచలన రిపోర్ట్ విడుదల చేయటంతో కంపెనీ సంపద తుడిచి పెట్టుకుపోయింది.

అయితే ఈ సారి రీసెర్చ్ సంస్థ ఎవరిని టార్గెట్ చేసింది. తన ట్వీట్లో మరో పెద్ద సంస్థపై రిపోర్టు విడుదల చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. దీని ప్రకారం ఈసారి టార్గెట్ అయిన కంపెనీ భారతదేశానికి చెందినదా లేక మరో దేశానికి చెందినదా అనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. అయితే ఈ సారి ఏ కంపెనీ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల ఇబ్బందులకు ఎదుర్కొంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంస్థ అమెరికాకు కంపెనీ సెప్టెంబర్ 2020లో ఎలక్ట్రిక్ ట్రక్ మేకర్ నికోలా కార్ప్‌పై నివేదికను బహిర్గతం చేసింది.
టార్గెట్ అదేనా..?
ఇప్పుడు చాలా మంది బ్యాంకింగ్ సంక్షోభం జరుగుతున్నందున ఆ రంగంలోని కంపెనీలపై రిపోర్టు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజాలు నేలకొరిగిన వేళ భారతదేశంలో చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను టార్గెట్ చేస్తూ మీమ్స్ చేశారు. అమెరికా బ్యాంకుల వైఫల్యాన్ని గుర్తించలేకపోవటంపై రీసెర్చ్ సంస్థను ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మరో రిపోర్ట్ రాబోతోందంటూ అమెరికా సంస్థ చేసిన ప్రకటన వ్యాపార వర్గాలతో పాటు ఇన్వెస్టర్లలోనూ ఆందోళనలకు కారణంగా మారింది.


Click it and Unblock the Notifications