ఆ ఒక్క కారణంతోనే గ్రీన్ కార్డు సస్పెండ్ చేసిన అమెరికా.. లబోదిబోమంటున్న భారత ఐటీ ఉద్యోగులు..

US Green Card Rules Explained: అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులకు, దిగ్గజ ఐటీ సంస్థలకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని విధంగా షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా అయిన గ్రీన్ కార్డ్ (Green Card) ఇప్పించే ప్రాసెస్ లో అత్యంత కీలకమైన 'శాశ్వత కార్మిక ధృవీకరణ' (PERM - Program Electronic Review Management) కార్యక్రమం నుండి భారతదేశపు అగ్రగామి ఐటీ సంస్థలతో పాటు కొన్ని అమెరికన్ దిగ్గజ సంస్థలను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 8, 2026 గురువారం నాడు వైట్ హౌస్ ప్రాంగణంలో ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సమక్షంలో కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు.

ఈ నిషేధం పరిధిలోకి ప్రముఖ ఐటీ సేవలు, అవుట్‌సోర్సింగ్ సంస్థలైన టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ (HCL), కాగ్నిజెంట్, క్యాప్‌జెమినిలతో పాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్‌లు కూడా వచ్చాయి. ఈ కంపెనీల నుండి ఇకపై ఎలాంటి కొత్త PERM లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను స్వీకరించబోమని.. అలాగే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా నిలిపివేస్తున్నామని అధికారులు తేల్చిచెప్పారు.

US Green Card Suspension 2026 TCS Green Card Filings Wipro Green Card News HCL Technologies US News Cognizant PERM Suspension Infosys Green Card US PERM Programme H-1B Visa Latest News Indian IT Workers in USA Trump Immigration Policy US Labour Department Employment-Based Green Cards Green Card Processing Freeze TCS HCL Technologies Cognizant PERM

2009 నుండి కేవలం ఈ కంపెనీలే దాదాపు 30 లక్షల మంది విదేశీ కార్మికుల కోసం అభ్యర్థించాయని.. అందులో 2,30,000 పైగా H-1B వీసాలు, 1,00,000 కంటే ఎక్కువ PERM లేబర్ సర్టిఫికేషన్లను పొందాయని వెల్లడించారు. మోసపూరిత దరఖాస్తులు, వేతనాల తగ్గింపు, అమెరికన్ కార్మికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే ఈ చర్యకు కారణమని స్పష్టం చేశారు.

అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులపై అత్యంత తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. సాధారణంగా ఒక విదేశీ ఉద్యోగికి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియ ప్రారంభించాలంటే PERM సర్టిఫికేషన్ తప్పనిసరి.

Also Read

ఈ లేబర్ సర్టిఫికేషన్ పొందిన తేదీయే ఉద్యోగి యొక్క "ప్రాధాన్యత తేదీ" (Priority Date) గా నిర్ణయించబడుతుంది. సస్పెన్షన్ కారణంగా ప్రభావిత కంపెనీల ఉద్యోగులు కొత్తగా PERM ఫైలింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో.. వారి గ్రీన్ కార్డ్ ప్రక్రియ నిలిచిపోయి అనంతమైన ఆలస్యం జరగనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 2026 వీసా బులెటిన్ ప్రకారం భారతీయులకు EB-2 కేటగిరీ లభ్యతలో లేకపోగా, EB-3 ప్రాధాన్యత తేదీ జనవరి 1, 2014గానే ఉంది.

మరోవైపు H-1B వీసాపై గరిష్టంగా ఆరు సంవత్సరాల గడువును చేరుకుంటున్న ఐటీ ఉద్యోగుల పరిస్థితి అత్యంత గందరగోళంగా మారింది. విదేశీ నిపుణులు 6 ఏళ్ల తర్వాత కూడా అమెరికాలో కొనసాగాలంటే తగినంత ముందుగా PERM ప్రక్రియ పూర్తయి ఉండాలి. అయితే ప్రస్తుతం PERM ఫైలింగ్స్ నిలిపివేయడంతో 6 ఏళ్ల కాలపరిమితి ముగుస్తున్న ఉద్యోగులు అమెరికాను వీడాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు. అయితే ఇప్పటికే PERM ఆమోదం పొంది, కేవలం గ్రీన్ కార్డ్ నంబర్ అందుబాటులో లేక వేచి చూస్తున్న వారికి నిబంధనల ప్రకారం 3 ఏళ్ల వరకు H-1B పొడిగింపులు పొందే వెసులుబాటు ఉంటుంది. అమెరికా కార్మికుల ప్రయోజనాల రక్షణ పేరిట ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం గ్లోబల్ ఐటీ రంగాన్ని ఊపేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+