US Government Shut down: మంగళవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మధ్య వ్యయ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రభుత్వ సేవలు, ఉద్యోగులు ప్రజా జీవితం ప్రభావితమవుతున్నాయి. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి జరిగిన షట్‌డౌన్ గతంలోని మూతపడే పరిస్థితుల కంటే భిన్నంగా ఉండనుంది. ట్రంప్ హెచ్చరించినట్లుగా, చట్టసభ సభ్యులు చట్టాన్ని ఆమోదించకపోతే మరిన్ని ఫెడరల్ ఉద్యోగులను పనినుంచి తొలగిస్తారని చెప్పడంతో అనిశ్చితి మరింతగా పెరిగింది.
ప్రతి సంవత్సరం అమెరికా కాంగ్రెస్ ప్రభుత్వ విభాగాల పనికి అవసరమైన ఖర్చుల చట్టాన్ని ఆమోదించాలి. అక్టోబర్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. కాని చాలా సందర్భాల్లో ఆ బిల్లులు సమయానికి పూర్తి కావు. అటువంటి సందర్భాల్లో తాత్కాలిక వ్యయ బిల్లులు (stopgap bill) ఆమోదిస్తారు. ఈసారి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు పొడిగింపుపై ఒప్పందానికి రాకపోవడంతో సెప్టెంబర్ 30న బిల్లుకు గడువు ముగిసింది. ఫలితంగా అనేక విభాగాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.

ఏజెన్సీలు, ఉద్యోగులపై ప్రభావం : 23 అతిపెద్ద ఫెడరల్ ఏజెన్సీలలో కనీసం 21 ఇప్పటికే తమ వద్ద ఎవరిని తొలగించబోతున్నారో ప్రణాళికలు వెల్లడించాయి. వేలాది మంది ఉద్యోగులు జీతం లేకుండా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.
సామాజిక భద్రత, మెడికేర్, మెడికైడ్: పదవీ విరమణ వికలాంగుల ప్రయోజనాలు కొనసాగుతాయి.అయితే సిబ్బందిలో 12% మంది తొలగిపోవడం వల్ల మార్కెటింగ్ ప్రచారాలు, కొంత పనిలో ఆలస్యం అవుతుంది. ఆరోగ్య చెల్లింపులు కొనసాగుతాయి.
ఆహార సహాయం (SNAP, WIC): SNAP (Supplemental Nutrition Assistance Program), WIC (మహిళలు, శిశువులు, పిల్లలకు ప్రత్యేక ఆహార సహాయం) కార్యక్రమాలు కొనసాగుతాయి.US వ్యవసాయ శాఖ ప్రకారం ఇవి షట్‌డౌన్ సమయంలో కూడా నడుస్తాయి.
పోస్టల్ సేవలు: US పోస్టల్ సర్వీస్ ప్రభుత్వ నిధులపై ఆధారపడదు. కాబట్టి పోస్టాఫీసులు తెరిచి ఉంటాయి, లేఖలు, పార్సిళ్లు సకాలంలో అందుతాయి.
IRS (Internal Revenue Service): షట్‌డౌన్ మొదటి ఐదు రోజులు IRS పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేస్తుంది.షట్‌డౌన్ ఎక్కువ కాలం సాగితే 75,000 మంది ఉద్యోగుల పరిస్థితి స్పష్టంగా తెలియదు. గతంలో IRS దాదాపు 25% సిబ్బందిని తొలగించింది.
విమానాశ్రయాలు: FAA ప్రకారం 13,000కిపైగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. TSA ఉద్యోగులూ పనిని కొనసాగిస్తారు. ప్రయాణం సాధారణంగా సాగుతుంది కానీ భద్రతా సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుంది.
ఫెడరల్ కోర్టులు: నిధులు అయిపోతే కోర్టులు పూర్తిస్థాయి పనిని కొనసాగించడం కష్టం. గత షట్‌డౌన్‌లో కోర్టులు ఐదు వారాలు కొనసాగాయి. ఈసారి కూడా నిధుల కొరత ఉంటే కోర్టుల పనితీరు ఆగిపోవచ్చు.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
సైన్యం: 20 లక్షల మంది సైనికులు జీతం లేకుండా విధులు నిర్వర్తిస్తారు. నేషనల్ గార్డ్ దళాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఒప్పందాలు కొనసాగుతాయి. అవసరమైన సామాగ్రి లేదా సేవల కోసం కొత్త ఆర్డర్లు ఇవ్వవచ్చు.
చట్ట అమలు విభాగాలు: FBI, DEA, కోస్ట్ గార్డ్ వంటి సంస్థల అధికారులు తమ పనిని కొనసాగిస్తారు. సరిహద్దు భద్రత, వలస నియంత్రణ కార్యకలాపాలు కొనసాగుతాయి. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ అమలు విభాగాల పనితీరు కూడా ప్రభావితం కాదు.
ఆర్థిక డేటా: ఉపాధి, GDP వంటి కీలక ఆర్థిక నివేదికలు నిలిపివేయబడతాయి. పెట్టుబడిదారులు, మార్కెట్ విశ్లేషకులు తాత్కాలికంగా స్పష్టమైన సమాచారం పొందలేరు.
చిన్న వ్యాపారాలు: Small Business Administration (SBA) తన సిబ్బందిలో 24% మందిని తొలగిస్తుంది.కొత్త రుణాలు ఆమోదం పొందవు. అయితే ప్రకృతి వైపరీత్యాల నుండి కోలుకోవడానికి అవసరమైన రుణాలు మాత్రం అందుతాయి.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో FEMA వద్ద $2.3 బిలియన్లు అందుబాటులో ఉన్నాయి. తుఫానులు, వరదలు, ఇతర విపత్తుల సమయంలో సహాయక చర్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని తెలిపింది.
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై విస్తృతమైన ప్రభావం చూపుతుంది. కీలకమైన సేవలైన రక్షణ, ఆరోగ్యం, సరిహద్దు భద్రత, ఆహార సహాయం లాంటివి కొనసాగుతాయి. కానీ సామాజిక సేవలు, ఆర్థిక డేటా, చిన్న వ్యాపార రుణాలు వంటి అనేక రంగాల్లో అంతరాయం తప్పదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందో యుఎస్ కాంగ్రెస్‌లోని రాజకీయ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications