అమెరికా చరిత్రలో అతి పొడవైన 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్ చివరికి ఎట్టకేలకు ముగిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆహార సహాయాన్ని పునరుద్ధరించడానికి, సమాఖ్య ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, విమాన-ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను తిరిగి ప్రారంభించడానికి అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు తుది ఒప్పందాన్ని ఆమోదించింది.
రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యంలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 222-209 ఓట్ల తేడాతో నిధుల బిల్లును ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ, డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సెనేట్‌లో ఈ బిల్లుకు ఇప్పటికే ఆమోదం లభించగా, ట్రంప్ బుధవారం తర్వాత సంతకం చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

ఈ చట్టం ద్వారా ప్రభుత్వ నిధులు జనవరి 30 వరకు పొడిగించబడతాయి. అయితే దీని వల్ల అమెరికా జాతీయ రుణం 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని, ఏటా సుమారు 1.8 ట్రిలియన్ డాలర్లను పెంచే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.ఈ షట్‌డౌన్ ప్రధానంగా ఫెడరల్ హెల్త్ ఇన్సూరెన్స్ సబ్సిడీల పొడిగింపుపై ఉద్భవించిన రాజకీయ ప్రతిష్టంభనతో మొదలైంది. సెనేట్, హౌస్ మధ్య బడ్జెట్ ఒప్పందంపై అనేక వారాలుగా చర్చలు సాగాయి కానీ అవి విఫలమయ్యాయి.
అరిజోనాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి డేవిడ్ ష్వీకెర్ట్ ఈ పరిణామాన్ని వ్యంగ్యంగా వివరిస్తూ.. ఇది సీన్‌ఫెల్డ్ ఎపిసోడ్‌లా ఉంది. కథాంశం లేని కామెడీ! 48 గంటల్లో ముగుస్తుందని అనుకున్నాం, కానీ 43 రోజులు గడిచాయని అన్నారు. డెమోక్రాట్లు ఈ బిల్లును పూర్తి విజయం కాని తాత్కాలిక పరిష్కారం"గా పేర్కొన్నారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ సబ్సిడీల పొడిగింపు విషయంలో హామీ ఇవ్వలేదని వారు విమర్శించారు.న్యూజెర్సీకి చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి మికీ షెర్రిల్ మాట్లాడుతూ.. తన పదవీ విరమణకు ముందు చివరి ప్రసంగంలో ఈ బిల్లును తీవ్రంగా ఖండించారు. పిల్లల ఆహారం తీసివేసి, ఆరోగ్య సంరక్షణను తగ్గించే పరిపాలనకు కాంగ్రెస్ ముద్ర వేయకండి. నేవీ మాదిరిగా, ఓడను వదులుకోకండని అన్నారు.
రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వే ప్రకారం 50 శాతం అమెరికన్లు షట్‌డౌన్‌కు రిపబ్లికన్లను నిందించగా.. 47 శాతం మంది డెమోక్రాట్లను నిందించారు. అంటే ఈ వివాదం రెండు పార్టీలకూ రాజకీయంగా దెబ్బతీసినట్లేనని చెప్పవచ్చు. Shutdown సమయంలో వేలాది ఫెడరల్ ఉద్యోగులు వేతనాలు పొందలేకపోయారు. విమాన సర్వీసులు, ఆహార పంపిణీ కార్యక్రమాలు అడ్డంకులకు గురయ్యాయి. ఈ ఒప్పందంతో అవి తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఏదేమైనా 43 రోజుల ప్రతిష్టంభన తర్వాత.. అమెరికా ప్రభుత్వం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఫెడరల్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించబడతాయి.ఆహార సహాయ పథకాలు, విమాన రవాణా నియంత్రణ సేవలు పునరుద్ధరించబడతాయి. అయితే, ఈ తాత్కాలిక ఒప్పందం జనవరి చివరి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అందువల్ల మరో బడ్జెట్ వివాదం వచ్చే అవకాశాన్ని విశ్లేషకులు విస్మరించడం లేదని తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications