Hindenburg News: అదానీ వరుసగా రెండు విజయాలను అందుకున్నారు. ముందుగా దేశంలో మళ్లీ మోదీ సర్కార్ కేంద్రంలో వస్తుందనే వార్తలు ఆయన సంపదను పెంచగా.. తాజాగా అమెరికా శుభవార్తతో అదానీ గ్రూప్ స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.
అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అకౌంటింగ్ మోసాలు, షేర్ల ఓవర్ వాల్యుయేషన్‌పై తీవ్రమైన ఆరోపణలను ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ జనవరిలో సంచన నివేదికను ఏర్పాటు చేసింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక స్థాయిల్లో వ్యతిరేకతలు, చర్చలు జరగగా చివరికి ఏజెన్సీలు సైతం దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో సైతం దీనిపై వాడీవేడి చర్చ జరిగింది.

తాజాగా అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం జరుపుతున్న విచారణ పూర్తయింది. దీంతో అదానీకి పెద్ద ఊరట లభించింది. అమెరికా ప్రభుత్వం అదానీకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో హిండెన్‌బర్గ్ ప్రణాళికలు విఫలమయ్యాయి. దీనికి ముందర శ్రీలంకలో అదానీ పోర్ట్స్ అభివృద్ది చేస్తున్న పోర్ట్ టెర్మినల్‌కు అమెరికా ప్రభుత్వం నుంచి మద్దతు లభించిన సంగితి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.4,500 కోట్లను సైతం పెట్టుబడిగా పెడుతోంది. అయితే ఇది రుణం రూపంలో పొందనుంది.
ఈ వార్తల నడుమ అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర భారీగా పెరిగింది. సాయంత్రం మార్కెట్లు ముగింపుకి ముందర ఏసీసీ సిమెంట్స్ స్టాక్ ధర 8.1 శాతం పెరిగి రూ.2,183.85 వద్ద, అదానీ ఎంటర్ ప్రైజెస్ 15.6 శాతం పెరిగి రూ.2,925 వద్ద, అదానీ గ్రీన్ స్టాక్ 20 శాతం పెరిగి రూ.1,348.5 వద్ద, అదానీ పోర్ట్స్ ధర 14.5 శాతం పెరిగి రూ.1,006.4 వద్ద, అదానీ పవర్ ధర 17.2 శాతం పెరిగి రూ.544.7 వద్ద, అంబుజా సిమెంట్స్ 7.8 శాతం పెరిగి రూ.511.4 వద్ద, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం పెరిగి రూ.878.7 వద్ద, అదానీ విల్మార్ 10 శాతం పెరిగి రూ.380.85 వద్ద, ఎన్డీటీపీ స్టాక్ ధర రూ.265.7 వద్ద ఉన్నాయి.


Click it and Unblock the Notifications