US Economy: ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. పెద్దన్న ట్రాక్ లో పడితే కానీ తమ కష్టాలు కొలిక్కిరావని చాలా మందికి తెలుసు. ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశాలకు ఊరటను ఇచ్చే ఒక వార్త అమెరికా నుంచి వచ్చింది. జో బైడెన్ ప్రభుత్వానికి సైతం ఇది చాలా కీలకమైనదని చెప్పుకోవాలి.

శుభవార్త ఇదే..
ఇంకెన్నాళ్లు వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం అని భావిస్తున్న అందరికీ అమెరికా విడుదల చేసిన తాజా డేటా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మూడో త్రైమాసికం డేటా ప్రకారం US GDP వృద్ధి 2.6 శాతంగా ఉంది. అంతకు ముందు రెండు త్రైమాసికాల్లో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పటం అందరినీ హడలించింది. తాజా వివరాలు వెలువడటంతో బైడెన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. దీంతో బలపడిన ఆర్థిక మాంద్యం బయాలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.

పెరిగిన ఎగుమతులు..
గురువారం విడుదల చేసిన బ్యూరో ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ Q3లో US ఎగుమతులు పెరిగినట్లు వెల్లడైంది. పైగా వినియోగదారుల వ్యయం, నివాసేతర స్థిర పెట్టుబడులు మెరుగుపడ్డాయని డేటా చూపుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన తరుణంలో తాజా గణాంకాలు ఖచ్చింతంగా పెద్ద ఊరట అని చెప్పుకోవాలి.

మొదటి రెండు క్వార్టర్స్..
ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి మొదటి త్రైమాసికంలో అమెరికా వృద్ధి 1.6% ఉండగా.. రెండవ త్రైమాసికంలో జీడీపీ 0.6 శాతంగా ఉంది. ఖచ్చితమైన డీటెల్స్ నవంబర్ 30, 2022న విడుదల అవుతాయి. ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మాంద్యం వైపు వెళ్లడం లేదని జులైలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చినట్లు కనిపిస్తోంది.

నిరుద్యోగం..
జూలైలో నిరుద్యోగం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు."మనం మాంద్యం వైపు వెళ్తున్నామని నేను అనుకోను" అని బైడెన్ అప్పట్లో చెప్పారు. గడచిన 40 ఏళ్లలో అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంత భారీ స్థాయికి చేరుకోవటం ఇదే తొలిసారి కావటం, వడ్డీ రేట్లు అమాంతం పెరగటం భారత్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications