US Recession: ఇప్పటి వరకు మాంద్యానికి ఎల్లప్పుడూ కేంద్రంగా ఉన్నది పెద్దన్న అమెరికానే. అందుకే అందరూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గమనిస్తుంటారు. వారి గణాంకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. డాలర్ రంకెలు వేస్తున్న ప్రస్తుత సమయంలో అమెరికా జీడీపీ నెగటివ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి..?

నెగటివ్ లో US GDP..
2022 రెండవ త్రైమాసికంలో US GDP -0.6 శాతంగా ఉంది. ఇంతకు ముందు ఇది -0.9 శాతం తగ్గుతుందని అంచనా వేయబడింది. కానీ.. ముడిచమురు ధరల్లో మార్పు, ఎగుమతులు పెరగడం పెద్దఎత్తున ఫలించటంతో ఆర్థిక నష్టాలు తగ్గాయి.

మార్చి క్వార్టర్..
ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడంతో మార్చి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అధ్వాన్న పరిస్థితికి చేరుకుంది. ఒక విధంగా చెప్పాలంటే టెక్నికల్ గా ఆర్థిక సంక్షోభాన్ని సూచించే అనేక సూచికలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అప్పుడు US ఆర్థిక వ్యవస్థ -1.6 శాతం క్షీణించింది. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై, పెట్టుబడులపై పడింది.

మైనస్ పరిమాణం..
ద్రవ్యోల్బణం కారణంగా దిగజారిన పరిస్థితుల వల్ల రెండు త్రైమాసికాలు నష్టాలను నమోదు చేసింది. ఆ తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి జారిపోయిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ.. ఈ వాదనను ఆర్థికవేత్తలు అప్పట్లో ఒప్పుకోలేదు. అయితే ప్రమాదం మాత్రం పొంచి ఉందని వారు అన్నారు.

మాంద్యం మాట నిజమే..
అమెరికా ఆర్థిక వ్యవస్థతో సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రస్తుత మార్కెట్ ఫండమెంటల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మారిన పరిస్థితుల వల్ల ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే US ఆర్థిక వ్యవస్థ ఇంకా అధికారికంగా మాంద్యంలోకి జారుకోలేదని వారు వెల్లడించారు.

మారుతున్న పరిస్థితులు..
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ మొదట్లో ప్రకటించినంత ప్రమాదకరంగా లేదని తెలుస్తోంది. ఈ వార్త అమెరికన్ మార్కెట్లకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మార్కెట్లకు ఆశాజనకమైనదని చెప్పుకోవాలి. అమెరికా ఎగుమతులు బలంగా పెరగటం వల్ల జూన్ క్వార్టర్లో తిరోగమనం నుంచి ఆర్థిక వ్యవస్థ చాలా వరకు పుంజుకుంది.

ఇయాన్ షెపర్డ్‌సన్ నివేదిక..
యూఎస్ జూన్ త్రైమాసికంలో భారీ క్షీణత నుంచి ఉత్పత్తి, ఎగుమతులు, ఉపాధి మార్కెట్, వినియోగదారుల మార్కెట్ కోలుకోవడంతో US ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందని ఇయాన్ షెపర్డ్‌సన్ పాంథియోన్ మాక్రో ఎకనామిక్స్ నివేదికలో రాశారు. ఇది ఇలాగే కొనసాగితే మాంద్యం నుంచి రక్షణ కలుగుతుందని అంచనాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications