Gautam Adani: అదానీకి అండగా అమెరికా.. చైనాకు చెక్ పెట్టేందుకు శ్రీలంక ప్లాన్..
Adani News: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గౌతమ్ అదానీని పావుగా వాడుకుంటోంది. పైగా డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయటం అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాకు సైతం చాలా కీలకం.
గౌతమ్ అదానీకి సంబంధించిన పెద్ద వార్త ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సునామీని సృష్టిస్తోంది. అవును శ్రీలంకలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో పోర్ట్ టెర్మినల్ నిర్మించేందుకు గౌతమ్ అదానీకి 553 మిలియన్ డాలర్లను అందించాలని నిర్ణయించింది. దీంతో పరోక్షంగా యూఎస్ పరిస్థితులను కంట్రోల్ చేయాలని చూస్తోంది.

ప్రధానంగా దక్షిణాసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది పరోక్షంగా దోహదపడే ఒప్పందంగా నిపుణులు చెబుతున్నారు. కొలంబోలోని వేస్ట్ కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేసేందుకు గౌతమ్ అదానీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని పొందనున్నారు. US ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆసియాలో అతిపెద్ద మౌలిక సదుపాయాల పెట్టుబడిగా కొనసాగుతోంది. పైగా అమెరికా శ్రీలంకలో చేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలలో అతిపెద్ద పెట్టుబడి.
తాజా చర్యతో భారత్-శ్రీలంక మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. శ్రీలంకలో ఓడరేవును అభివృద్ధి చేయడానికి గౌతమ్ అదానీకి నిధులు మంజూరు చేయడం కూడా ఇటీవలి కాలంలో శ్రీలంకలో చైనా ప్రభావం పెరుగుతోందని అమెరికా ఆందోళన వల్ల తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ 2023లో ఇప్పటివరకు 9.3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. గతేడాది శ్రీలంకలో చైనా 2.2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుగా మారింది. పైగా శ్రీలంకను చైనా అప్పుల ఊబిలో బంధిస్తోందని, ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని అమెరికా అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications