US Fed Rate Hike: ఫెడ్ దూకుడు.. 75 బేసిస్ పాయింట్ల మేర రేటు పెంపు.. భారత్ ప్రభావం..
US Fed Rate Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలకు నిద్రలేకుండా చేస్తుండగా.. మరో పక్క సెంట్రల్ బ్యాంకులు మాత్రం పాలసీ రేట్లను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం నాడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా రెండో సారి తన వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కెనడా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సైతం వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నాయి.

మాంద్యం వస్తుందా..
ఈ సారి ఏకంగా వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ ప్రకటన చేసింది. చైర్ జెరోమ్ పావెల్ US ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉందనే ఊహాగానాలను తిరస్కరించారు. అయితే మరో సారి కూడా వడ్డీ రేట్ల వడ్డన భారీగానే ఉండవచ్చని చెప్పారు. లేబర్ మార్కెట్ బలంగా ఉండటం కొంత ఊరటనిస్తోంది. ఇది మాంద్యానికి దూరంగా ఉన్నట్లు సూచిస్తుంది.

గత 40 ఏళ్లలో..
గడచిన 40 ఏళ్లలలో అత్యంత తీవ్రమైన వ్యయ ఒత్తిళ్లను విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్నారు. 1980ల తర్వాత ఇంత భారీ స్థాయిలో వడ్డీ రేట్లు పెరగటం ఇదే తొలిసారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మళ్లీ సెప్టెంబర్ 20-21 మరో సారి విధాన నిర్ణేతలు మమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఈ సారి సెప్టెంబర్ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రేట్ల తగ్గింపు ఎప్పుడు..
ఫెడ్ ఏదో ఒక సమయంలో పెరుగుదల వేగాన్ని నెమ్మదిస్తుందని పావెల్ చెప్పారు. డాలర్‌తో పాటు ట్రెజరీ దిగుబడులు పడిపోవడంతో, రేటు పెరుగుదల ప్రకటన కారణంగా అమెరికా మార్కెట్లలో ర్యాలీ మెుదలైంది.

భారత్ పై ప్రభావం..
ఫెడ్ తాజా రేటు పెంపు నిర్ణయం వల్ల భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనికి తోడు రూపాయి విలువ మరింతగా క్షీణించి ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే దిగుమతులు భారంగా మారుతుంది. విదేశీ ప్రయాణాలు ఖరీదుగా మారతాయి. విదేశీ విద్య భారతీయులకు ప్రియంగా మారనుంది. దీనికి తోడు అనేక నిత్యావసరాల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థాల రేట్లు పెరిగి సామాన్యులపై భారం పడుతుంది. అయితే వచ్చే నెల మెుదటి వారంలో జరిగి ద్రవ్యవిధాన పరపతి సమావేశంలో రిజర్వుబ్యాంక్ 35 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications